Bluesky: యూజర్లకు బ్లూస్కై గుడ్‌న్యూస్.. 10 నిమిషాల వీడియోలకు అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ బ్లూస్కై తన వీడియో అప్‌లోడ్ ఫీచర్‌లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు గరిష్ఠంగా మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోలను మాత్రమే అప్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా ఈ పరిమితిని 10 నిమిషాలకు పెంచింది. తక్కువ నిడివి వీడియోలను అందించే ఇతర టెక్స్ట్ ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు పోటీగా నిలిచేందుకు బ్లూస్కై ఈ మార్పు చేసింది.
వివరాలు
అప్‌లోడ్ వేగం 2-3 రెట్లు పెంపు
వీడియో నిడివిని పెంచడంతో పాటు అప్‌లోడ్ సామర్థ్యాన్ని కూడా బ్లూస్కై మెరుగుపరిచింది.
ఇకపై గరిష్ఠంగా 300MB పరిమాణం ఉన్న వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు.
గతంతో పోలిస్తే వీడియో అప్‌లోడ్ వేగం 2-3 రెట్లు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.
దీంతో ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను యూజర్లు తక్కువ సమయంలో సులభంగా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
AT ప్రోటోకాల్ ఆధారిత యాప్‌లలోనూ అందుబాటులో..
బ్లూస్కై తీసుకొచ్చిన ఈ కొత్త వీడియో ఫీచర్.. ఆ ప్లాట్‌ఫామ్‌కు ఆధారంగా ఉన్న AT Protocolపై పనిచేసే ఇతర యాప్‌లలోనూ అందుబాటులో ఉంటుంది.
బ్లూస్క్రీన్, రీలో, స్కైలైట్ వంటి యాప్‌లలో కూడా 10 నిమిషాల వీడియోలను అప్‌లోడ్ చేసుకోవచ్చు.
దీంతో వీడియో అప్‌లోడ్ విషయంలో బ్లూస్కై.. టిక్‌టాక్‌కు దగ్గరైంది. టిక్‌టాక్‌లో 10 నిమిషాల వరకు వీడియోలను అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది.
మెటాకు చెందిన థ్రెడ్స్‌లో ఐదు నిమిషాల వరకు, ఎక్స్‌లో ఉచిత యూజర్లకు గరిష్ఠంగా 140 సెకన్ల వరకు వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు.
వివరాలు
బ్లూస్కై యాక్టివ్ యూజర్లు 25 శాతానికి పైగా తగ్గుదల
మరోవైపు బ్లూస్కై యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గుతున్న సమయంలో ఈ అప్‌డేట్‌ను తీసుకురావడం గమనార్హం.
జులై నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బ్లూస్కై యాక్టివ్ యూజర్ల సంఖ్య 25 శాతానికి పైగా తగ్గినట్లు సమాచారం.
ఈ పరిస్థితుల్లో పొడవైన వీడియోలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్లాట్‌ఫామ్‌పై యూజర్ల ఆసక్తిని కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది.
సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లను వీడియోలకు మరింత అనుకూలంగా మార్చే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో బ్లూస్కై కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది.