LOADING...
Sriharikota: శ్రీహరికోట షార్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. భద్రతా బలగాల హై అలర్ట్‌!
శ్రీహరికోట షార్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. భద్రతా బలగాల హై అలర్ట్‌!

Sriharikota: శ్రీహరికోట షార్‌కు బాంబు బెదిరింపు కాల్‌.. భద్రతా బలగాల హై అలర్ట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం 'షార్‌'కు ఈ రోజు (సోమవారం) ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. ఈ సమాచారాన్ని తమిళనాడు కమాండ్ కంట్రోల్‌కు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు షార్ పరిసరాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టారు. ఇటీవల భారత్‌-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో దేశంలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో భద్రతను బలపరిచారు. అలాగే పోర్టులు, విమానాశ్రయాలపై కూడా ఉగ్ర దాడులు జరిగే అవకాశముందన్న సమాచారంతో అక్కడి భద్రతను కూడా గణనీయంగా పెంచారు.

Details

ముమ్మరంగా తనీఖీలు చేపడుతున్న అధికారులు

ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన కీలక కేంద్రం అయిన శ్రీహరికోట 'షార్‌' వద్ద భద్రతా బలగాలను భారీగా మోహరించారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమోనన్న కోణంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.