Loading...
Anthropic: పదేళ్లలో క్యాన్సర్‌ సహా పెద్ద జబ్బులకు చెక్‌.. ఏఐ దిగ్గజం సంచలన అంచనా!
పదేళ్లలో క్యాన్సర్‌ సహా పెద్ద జబ్బులకు చెక్‌.. ఏఐ దిగ్గజం సంచలన అంచనా!

Anthropic: పదేళ్లలో క్యాన్సర్‌ సహా పెద్ద జబ్బులకు చెక్‌.. ఏఐ దిగ్గజం సంచలన అంచనా!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (ఏఐ) వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణం కానుందా? క్యాన్సర్‌, అల్జీమర్స్‌, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యాలకు మరో పదేళ్లలోనే పరిష్కారం లభించనుందా? భవిష్యత్తులో ఈ వ్యాధులన్నీ గత చరిత్రగా మారే అవకాశం ఉందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్‌ అంచనా వేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై ఔషధ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్‌, అల్జీమర్స్‌, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక అనారోగ్యాలు మరో దశాబ్దంలో అంతరించిపోవచ్చని అమోడెయ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మానవాళి సరైన దిశలో పరిశోధనలు కొనసాగిస్తే, వేల ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కనుగొనే అద్భుతమైన కాలాన్ని సృష్టించవచ్చని పేర్కొన్నారు.

వివరాలు 

ఆల్ఫాఫోల్డ్‌ విజయాన్ని ఉదాహరణగా చూపుతున్న ఏఐ నిపుణులు

ముఖ్యంగా జీవశాస్త్ర పరిశోధనలు,ఔషధాల తయారీ,వైద్య ఆవిష్కరణల ప్రక్రియను కృత్రిమమేధ గణనీయంగా వేగవంతం చేయగలదని ఆయన అభిప్రాయపడ్డారు.

గూగుల్‌ ఏఐ విభాగం అధిపతి డెమిస్‌ హసాబిస్‌,టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ కూడా ఇదే తరహా ఆశాభావాన్ని గతంలో వ్యక్తం చేశారు.

సాధారణంగా కొత్త ఔషధాల అభివృద్ధికి పదేళ్లు పట్టే ప్రక్రియను ఏఐ సాయంతో కొన్ని వారాల్లోనే పూర్తి చేయవచ్చని హసాబిస్‌ పేర్కొన్నారు.

ఇందుకు ఆల్ఫాఫోల్డ్‌ అనే ఏఐ సాధనాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.ఈ టెక్నాలజీ 20కోట్లకు పైగా ప్రొటీన్ల నిర్మాణాలను అంచనా వేయగలిగింది.

ఇది శాస్త్రీయ పరిశోధనల్లో గొప్ప విజయంగా నిలిచింది.అయితే ఇలాంటి పురోగతి ఉన్నంత మాత్రాన క్యాన్సర్‌ వంటి సంక్లిష్ట వ్యాధులకు పదేళ్లలోనే పూర్తిస్థాయి చికిత్సలు అందుబాటులోకి వస్తాయని చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వివరాలు 

ఔషధ రంగం ఏమంటోంది?

ఏఐ ద్వారా వైద్య రంగంలో భారీ మార్పులు వస్తాయన్న అంచనాలపై ఔషధ తయారీ సంస్థల ప్రతినిధులు అంతగా నమ్మకం వ్యక్తం చేయడం లేదు.

వెర్టెక్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జెఫ్‌ లీడెన్‌ ఈ తరహా కాలపరిమితులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దాదాపు 10 వేల ఔషధ సమ్మేళనాలను పరిశీలించే క్రమంలో 50 ఏఐ సంస్థలకు చెందిన సాంకేతికతలను పరీక్షించినట్లు వెల్లడించారు.

అయితే వాటిలో ఏ ఒక్కటీ మానవ జోక్యం లేకుండా స్వతంత్రంగా పనిచేసే ఔషధాన్ని అభివృద్ధి చేయలేకపోయిందని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

ఔషధ రంగం ఏమంటోంది?

కంప్యూటర్‌ నమూనాలో ఒక ఔషధ అణువు ఆశాజనకంగా కనిపించడం పరిశోధనలో తొలి దశ మాత్రమే.

ఆ తర్వాత దానిని ప్రయోగశాలలో పరీక్షించాలి. జంతువులపై అధ్యయనాలు నిర్వహించాలి.

అనంతరం మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టాలి. ఈ అన్ని దశల్లోనూ ఆ ఔషధం సురక్షితమైనదా? వ్యాధిని నిజంగా నయం చేయగలదా? అనే అంశాలను నిర్ధారించుకోవాలి.

చివరగా సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

ఔషధ రంగం ఏమంటోంది?

సాధారణంగా ఒక కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి 10 నుంచి 12 ఏళ్ల సమయం పడుతుంది.

ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కువ సమయం వివిధ పరీక్షలు, అధ్యయనాలకే కేటాయించాల్సి ఉంటుందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

అందువల్ల ఏఐ పరిశోధనల వేగాన్ని పెంచగలిగినా, ఔషధాల అభివృద్ధిలో ఉన్న అన్ని దశలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని వారి అభిప్రాయం.

ADVERTISEMENT