Chandrayaan 3 : మరో సూపర్ న్యూస్‌ను అందించిన ఇస్రో.. జాబిల్లికి అడుగు దూరంలో విక్రమ్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీ-బూస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటన చేసింది. దీంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యుల్ చేసింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25 కి.మీ, అత్యధికంగా 135 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో ఉంది. ప్రస్తుతం చివరిదశ అయిన విక్రమ్ సాప్ట్ ల్యాండింగ్ పై ఇస్రో శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. అన్ని అనుకూలిస్తే ఇస్రో ఆగస్టు 23న చంద్రుడి దక్షణధ్రువంపై ల్యాండ్ కానుంది. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుందని ఇస్రో చెప్పింది.