LOADING...
చంద్రయాన్-3 కక్ష్య కుదింపు చర్యలు పూర్తి చేసిన ఇస్రో: ఇక మిగిలింది అదొక్కటే 
కక్ష్య కుదింపు చర్యలన్నీ పూర్తి చేసుకున్న చంద్రయాన్-3

చంద్రయాన్-3 కక్ష్య కుదింపు చర్యలు పూర్తి చేసిన ఇస్రో: ఇక మిగిలింది అదొక్కటే 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 16, 2023
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రుడి మీదకు పంపించిన చంద్రయాన్-3, జాబిల్లికి మరింత చేరువయ్యింది. చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 తన కక్ష్యను తగ్గించుకుని చంద్రుడికి మరింత చేరువయ్యేలా కక్ష్య కుదింపు చర్యను ఇస్రో ఈరోజు చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో కక్ష్య కుదింపు చర్యలన్నీ పూర్తయ్యాయని ఇస్రో తెలిపింది. అలాగే ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ రేపు(ఆగస్టు 17) విడిపోనుందని ఇస్రో వెల్లడి చేసింది. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5:47గంటల ప్రాంతంలో చంద్రుడి మీద ల్యాండర్ మాడ్యూల్ దిగుతుంది. చంద్రయాన్-3 ప్రయోగం జులై 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుండి మొదలైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో ట్వీట్