చంద్రయాన్ - 3 ఎప్పుడు లాంచ్ కానుంది? వివరాలివే?
చంద్రుడిపై అన్వేషణ కొనసాగించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), చంద్రయాన్ - 3 పనులను వేగంగా జరుపుతోంది. ఎల్ వీ ఎమ్ 3 వాహక నౌక ద్వారా చంద్రయాన్ - 3ని శ్రీహరికోట నుండి లాంచ్ చేయనున్నారు. చంద్రయాన్ 3 మిషన్ లక్ష్యాలు: చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ కావడాన్ని చూపించడం. చంద్రుడిపై రోవర్ తిరుగుతున్నట్లు చూపించడం. నిర్దేశించిన ప్రదేశంలో ప్రయోగాలు జరపడం మొదలగునవి. చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనేక పరిశోధనలు చేస్తూనే ఉంది. చంద్రుడిపై అన్వేషణలో ఇప్పటివరకు చంద్రయాన్ -1, చంద్రయాన్ - 2 లాంచింగ్స్ జరిగాయి. కానీ చంద్రయాన్ - 2 మిషన్ మాత్రం క్రాష్ అయ్యింది.
600కోట్ల బడ్జెట్
చంద్రయాన్ - 3 మిషన్ ను జులై 12-19మధ్య సమయాల్లో ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. షెడ్యూల్ చేసిన ప్రాంతంలో ల్యాండింగ్ చేయడం కష్టంగా మారితే వేరే చోట ల్యాండింగ్ చేసేందుకు అనుకూలంగా సాఫ్ట్ వేర్ ను అమర్చినట్లు తెలుస్తోంది. చంద్రయాన్ - 3 మిషన్ కోసం 600కోట్ల రూపాయల బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం అందించిందని సమాచారం. చంద్రయాన్ - 3 మిషన్ ఉపగ్రహం వీరముత్తయేల్ అనే శాస్త్రవేత్త నేతృత్వంలో తయారయ్యింది. చంద్రయాన్ - 3 మిషన్ ఉప్రగ్రహం బరువు 3900కిలోలు ఉంటుందని, దాన్ని బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రంలో డెవలప్ చేసినట్లు ఇస్రో వెల్లడి చేసింది.