Page Loader
చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్ 
ఆగస్ట్ 23న జాబిల్లిపైకి ల్యాండర్

చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 14, 2023
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

జాబిల్లికి చంద్రయాన్‌-3 మరింత చేరువైంది. జాబిల్లి చుట్టు వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఇస్రో దిగ్విజయంగా చేపట్టింది. చంద్రుడిపై పరిశోధనలకుగానూ చంద్రయాన్‌-3 చేపట్టిన ప్రక్రియ నేటితో నెల పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జాబిల్లి చుట్టూ రౌండ్స్ వేస్తున్న ఈ వ్యౌమనౌక, ఇవాళ చందమామకు చేరువగా వచ్చింది. ఈ మేరకు చంద్రయాన్‌-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని (Orbit Reduction Maneuver)జయప్రదం చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని టెలీమెట్రీ,ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ISTRAC) నుంచి కక్ష్య తగ్గింపు ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపింది. చందమామను చుట్టేస్తున్న చంద్రయాన్‌-3కి ఇది రెండో చివరి కక్ష్యగా ఇస్రో పేర్కొంది. ఇవాళ్టి విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ x 177 కి.మీలకు తగ్గించామని ఇస్రో వివరించింది.

DETAILS

ఆగస్ట్ 16న ఉదయం 8.30కు తదుపరి కక్ష్య తగ్గింపు విన్యాసం

ఆగస్ట్ 16న ఉదయం 8.30కు తదుపరి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపై దాదాపుగా 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి ఈ అంతరిక్ష నౌక చేరనుంది. ఈ క్రమంలోనే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోతుంది.ఇస్రో అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 23 సాయంత్రం ల్యాండర్‌ జాబిల్లిపై పాదం మోపనుంది. చంద్రయాన్‌-3ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో మరుసటిరోజే కక్ష్యను మొదటిసారిగా పెంచారు. 18 రోజుల వ్యవధిలో మొత్తం 5 సార్లు కక్ష్యను ఇస్రో పెంచేసింది.అయిదో భూకక్ష్య తర్వాత ఆగస్ట్ 1న ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ఆగస్ట్ 5న జాబిల్లి కక్ష్యలోకి చేర్చి క్రమంగా చందమామకు చేరువ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్రుడికి మరింత చేరువలో చంద్రయాన్ - 3: ఇస్రో