200కి పైగా పుస్తకాలు రాసిన ChatGPT, అమెజాన్ లో అందుబాటులో ఉన్న పుస్తకాలు
కొన్ని కష్టమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిడమే కాదు ChatGPT ఇప్పుడు రచయితగా మారింది. ప్రారంభించిన రెండు నెలల్లోనే, టెక్ పరిశ్రమలో భారీ ప్రకంపనలు సృష్టించింది. AI చాట్‌బాట్, దాని మానవ-వంటి సంభాషణా సామర్థ్యాలతో, కొంతమందితో తమ ఉద్యోగాల కోసం కూడా బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు, అమెజాన్ బుక్‌స్టోర్ AI సాధనాన్నిపుస్తకాల రచయితగా పరిచయం చేసింది.. 200 కంటే ఎక్కువ పుస్తకాలను రచించిందని ఒక నివేదికలో ప్రకటించింది. ChatGPT అమెజాన్‌లో ఇ-బుక్స్ లేదా పేపర్‌బ్యాక్‌లుగా కొనుగోలు చేయగల 200కి పైగా పుస్తకాలకు రచయతగా, సహ రచయితగా వ్యవహరించింది. ఈ పుస్తకాలలో "ChatGPTని ఉపయోగించి కంటెంట్‌ని ఎలా వ్రాయాలి, సృష్టించాలి", "ది పవర్ ఆఫ్ హోమ్‌వర్క్", "ఎకోస్ ఆఫ్ ది యూనివర్స్" వంటివి ఉన్నాయి.
"ChatGPTలో ChatGPT: The AI Explains Itself" అనే పేరుతో పుస్తకం రాసిన ChatGPT
"ChatGPTలో ChatGPT: The AI Explains Itself" అనే పేరుతో ఉన్న మరొక పుస్తకం పూర్తిగా ChatGPTనే రాసింది. పుస్తకం Kindleలో ఉచితంగా లభిస్తుంది, కానీ పేపర్ బ్యాక్ వెర్షన్ పుస్తకం ధర $11.99. ChatGPT పిల్లల కథలు కూడా రాసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఒక ఫైనాన్షియల్-టెక్ కంపెనీలో పనిచేస్తున్న అమ్మార్ రేషి, AI చాట్‌బాట్‌ను ఉపయోగించి పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. రైటర్స్ గ్రూప్ ఆథర్స్ గిల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ రాసెన్‌బెర్గర్ మాట్లాడుతూ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రచయితలు త్వరలో తమ ఉద్యోగాలను కోల్పోతారని అన్నారు. ఇది మనం నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం, ఈ పుస్తకాలు మార్కెట్ లోకి వస్తే రచయితలకు పని లేకుండా పోతుందని ఆమె అన్నారు.