
ChatGPT: భారత వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ చెల్లింపులు మరింత సులభం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నాల్లో భాగంగా ఓపెన్‌ఏఐ కొత్త అడుగు వేసింది. దేశీయ కరెన్సీలో చాట్‌జీపీటీ (ChatGPT) ప్లాన్ల ధరలను నిర్ణయిస్తూ, ఈ మార్పును ప్రయోగాత్మకంగా అమలు చేయాలని యోచిస్తోంది. 'మనీకంట్రోల్' కథనం ప్రకారం, ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ప్రస్తుతం భారత కస్టమర్లు చాట్‌జీపీటీ ప్లస్ ప్లాన్‌కు నెలకు 20 డాలర్లు, ప్రో ప్లాన్‌కు 200 డాలర్లు, బిజినెస్ ప్లాన్‌లో ప్రతి సీట్‌కు 30 డాలర్ల చొప్పున చెల్లిస్తున్నారు.
Details
మరింత సులభంగా చెల్లింపులు
అయితే, కొత్త ధరల ప్రకారం ప్లస్ ప్లాన్ జీఎస్టీతో కలిపి రూ.1,999, ప్రో ప్లాన్ రూ.19,900, బిజినెస్ ప్లాన్‌లో ప్రతి సీటు రూ.2,099గా నిర్ణయించింది. దీని వల్ల దేశీయ వినియోగదారులు మరింత సులభంగా చెల్లింపులు జరపగలరని భావిస్తోంది. ఇక ఇటీవలే ఓపెన్‌ఏఐ తన అత్యంత ఆధునిక ఏఐ మోడల్ 'చాట్‌జీపీటీ-5'ను పరిచయం చేసింది. కోడింగ్, గణితం, రచన, హెల్త్‌కేర్ వంటి విభిన్న రంగాల్లో ఇది అత్యుత్తమ పనితీరును కనబరుస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటివరకు తాము అభివృద్ధి చేసిన మోడళ్లలో ఇది అత్యంత శక్తివంతమైనదిగా పేర్కొంటూ, వేగం, విశ్లేషణ సామర్థ్యాలు, ఖచ్చితత్వం తదితర అంశాల్లో మునుపటి మోడళ్ల కంటే ముందంజలో ఉందని తెలిపింది.