Loading...
ChatGPT Protein Design: చాట్‌జీపిటీతో ప్రోటీన్‌ డిజైన్‌...ఓపెన్‌ఏఐ జిపిటి 6తో సరికొత్త ప్రయోగం
చాట్‌జీపిటీతో ప్రోటీన్‌ డిజైన్‌...ఓపెన్‌ఏఐ జిపిటి 6తో సరికొత్త ప్రయోగం

ChatGPT Protein Design: చాట్‌జీపిటీతో ప్రోటీన్‌ డిజైన్‌...ఓపెన్‌ఏఐ జిపిటి 6తో సరికొత్త ప్రయోగం

వ్రాసిన వారు Balachander Sharma
Nov 25, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

చాట్‌జీపీటీ ఇక కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికే పరిమితం కాకుండా.. ప్రోటీన్లను డిజైన్‌ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఓపెన్‌ఏఐ ప్రకారం, తాజా జిపిటి-6 కుటుంబానికి చెందిన మోడళ్లు కొత్త ప్రోటీన్‌ నిర్మాణాలు, అమైనో యాసిడ్‌ సీక్వెన్స్‌లను రూపొందించగలవు. ఈ పరిశోధన వివరాలను మంగళవారం విడుదల చేసిన ప్రీప్రింట్‌లో వెల్లడించింది. సాధారణ భాషలో ఇచ్చే సూచనలతోనే ప్రోటీన్‌లోని రెండు అణువుల మధ్య బంధం నుంచి మొత్తం ప్రోటీన్‌ ఆకారం వరకు మోడల్‌ను గైడ్‌ చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Details

ల్యాబ్‌లోనూ పరీక్షించిన డిజైన్లు

ఈ ప్రయోగంలో ఓపెన్‌ఏఐ పరిశోధనా భాగస్వామి ఒనావాతో కలిసి కొన్ని డిజైన్లను వాస్తవంగా రూపొందించి పరీక్షించారు.

జిపిటి-6.2 ముందస్తు వెర్షన్‌తో రూపొందించిన నిర్మాణాల ఆధారంగా తయారైన ప్రోటీన్లు ఐదు టార్గెట్లతో బంధించే సంకేతాలను చూపించాయి.

తొలి ప్రయోగంలో 322 మినీబైండర్లను ఐదు టార్గెట్లపై పరీక్షించగా 35, అంటే 10.9 శాతం, బైండింగ్‌ చూపించాయి. ఇందులో IL-17A, VEGF-A, PD-L1, IL-7Ra, TrkA వంటి టార్గెట్లు ఉన్నాయి.

Details

పాత సీక్వెన్స్‌లకు కొత్త రూపాలు

ఇప్పటికే తెలిసిన మినీబైండర్లు, యాంటీబాడీలకు కొత్త అమైనో యాసిడ్‌ సీక్వెన్స్‌లను రూపొందించడంలోనూ మోడల్‌ ఆసక్తికర ఫలితాలు ఇచ్చింది.

కొన్ని సందర్భాల్లో కొత్త సీక్వెన్స్‌లు అసలు వాటితో చాలా భిన్నంగా ఉన్నప్పటికీ.. వాటి లక్ష్యాలను గుర్తించే సామర్థ్యాన్ని కొనసాగించాయి.

ఉదాహరణకు VEGF-Aలో 50 శాతం, MDM2లో 43 శాతం, PD-1లో 15 శాతం వరకు సీక్వెన్స్‌ తేడా కనిపించింది.

యాంటీబాడీ ప్రయోగాల్లో 182 డిజైన్లలో 128, అంటే 70 శాతం, బైండింగ్‌ సంకేతాలు చూపించాయి.

ADVERTISEMENT

Details

శాస్త్రవేత్తలకు కొత్త సాధనం.. కానీ పరిమితులు ఉన్నాయి

ఈ ఫలితాలు ప్రోటీన్‌ డిజైన్‌లో ఏఐ వినియోగానికి కొత్త అవకాశాలను చూపిస్తున్నప్పటికీ.. ఇది ఇంకా పూర్తిస్థాయి పరిష్కారం కాదని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది.

ముఖ్యంగా మొత్తం ప్రోటీన్‌ నిర్మాణాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ఇంకా బలహీనమైన అంశంగానే ఉంది.

అలాగే ఎలాంటి సహాయం లేకుండా కొత్త మినీబైండర్లను మొదటి నుంచి చివరి వరకు రూపొందించగలదని ఈ ప్రయోగాలు నిరూపించలేదని తెలిపింది.

ఇదే సమయంలో ఇలాంటి ఏఐ మోడళ్ల వల్ల వచ్చే బయోసెక్యూరిటీ ప్రమాదాలను కూడా పరిశీలిస్తున్నట్లు ఓపెన్‌ఏఐ వెల్లడించింది.

ADVERTISEMENT