Loading...
China: కృత్రిమ సూర్యుడి కల సాకారం దిశగా చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ అయస్కాంతం సిద్ధం
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ అయస్కాంతం సిద్ధం

China: కృత్రిమ సూర్యుడి కల సాకారం దిశగా చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ అయస్కాంతం సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అపరిమిత, కాలుష్యరహిత విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న కృత్రిమ సూర్యుడి (ఆర్టిఫిషియల్ సన్) అభివృద్ధి ప్రాజెక్టులో చైనా మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అవసరమైన ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్‌ను విజయవంతంగా నిర్మించి, దాని పనితీరును పరీక్షించినట్లు వెల్లడించింది. ఈ భారీ ఫ్యూజన్ మ్యాగ్నెట్ బరువు 582 టన్నులు కాగా,దీని పొడవు 21 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు. ఆంగ్ల అక్షరం 'D' ఆకారంలో రూపొందించిన ఈ అయస్కాంతం ఫ్యూజన్ రియాక్టర్‌లో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. కృత్రిమ సూర్యుడి సృష్టికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరికరాల్లో ఇది ఒకటిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

వివరాలు 

2030 నాటికి కొత్త తరహా స్వచ్ఛ ఇంధన వనరు

ఈ సూపర్‌కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్‌ను చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసింది.

అంతేకాకుండా, ఫ్యూజన్ రియాక్టర్‌కు గుండెకాయగా భావించే సూపర్‌కండక్టింగ్ సెంట్రల్ సొలెనాయిడ్ కాయిల్‌ను కూడా చైనా పరిశోధకులు తాజాగా విజయవంతంగా పరీక్షించారు.

ఈ కాయిల్ ఫ్యూజన్ ప్రక్రియను సమర్థంగా నియంత్రించడంలో కీలక పాత్ర పోషించనుంది.

కృత్రిమ సూర్యుడి ద్వారా అణు సంలీన (ఫ్యూజన్) ప్రక్రియను భూమిపై సృష్టించి,శుద్ధమైన, అపరిమిత విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో చైనా పరిశోధనలు వేగవంతం చేస్తోంది.

ఈ ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేసి, ప్రపంచానికి కొత్త తరహా స్వచ్ఛ ఇంధన వనరును అందుబాటులోకి తీసుకురావాలని చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ADVERTISEMENT