Loading...
Chloride and water in e20: ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్‌, నీటి కల్తీ ఉందా? చమురు సంస్థల పరీక్షల్లో ఏం తేలిందంటే..
ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్‌, నీటి కల్తీ ఉందా? చమురు సంస్థల పరీక్షల్లో ఏం తేలిందంటే..

Chloride and water in e20: ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్‌, నీటి కల్తీ ఉందా? చమురు సంస్థల పరీక్షల్లో ఏం తేలిందంటే..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
02:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ20 పెట్రోల్‌లో క్లోరైడ్‌, నీటి కల్తీ ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు స్పందించాయి. దేశవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించిన పరీక్షల్లో ఇంధనంలో ఎలాంటి కల్తీ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని స్పష్టం చేశాయి. వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహించాయి. ఇందులో భాగంగా శుద్ధి కేంద్రాలు, ఇథనాల్ తయారీ కేంద్రాలు, నిల్వ కేంద్రాలు, రవాణా కేంద్రాలు, పెట్రోల్ బంకుల నుంచి యాదృచ్ఛికంగా ఇంధన నమూనాలను సేకరించారు. శుద్ధి కేంద్రాల నుంచి సేకరించిన 100కుపైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించారు. వీటిలో క్లోరైడ్ స్థాయి ఒక పీపీఎం లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి.

వివరాలు

ఈ20 పెట్రోల్, ఇథనాల్ నమూనాలు పరిశీలన..

దీంతో రిఫైనరీల నుంచి బయటకు వచ్చే పెట్రోల్ నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని పేర్కొన్నాయి.

నిల్వ కేంద్రాలు, ట్యాంకర్ రవాణా ప్రాంతాల్లోనూ ఈ20 పెట్రోల్, ఇథనాల్ నమూనాలను పరిశీలించారు.

80కి పైగా నమూనాల్లో క్లోరైడ్ స్థాయి మూడు పీపీఎం కంటే తక్కువగానే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

పెట్రోల్ బంకుల్లోనూ తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 1,000కుపైగా నమూనాలను సేకరించగా.. వాటిలో 160 పరీక్షా నివేదికలను పరిశీలించారు.

ఈ నివేదికల్లో క్లోరైడ్ స్థాయి సున్నా నుంచి మూడు పీపీఎం మధ్యలోనే ఉన్నట్లు సంస్థలు తెలిపాయి.

ఈ20 పెట్రోల్‌లో వందల పీపీఎం స్థాయిలో క్లోరైడ్ ఉన్నట్లు వస్తున్న ఆరోపణలకు తాజా పరీక్షల ఫలితాలు భిన్నంగా ఉన్నాయని చమురు సంస్థలు పేర్కొన్నాయి.

ADVERTISEMENT