LOADING...
Chrome: కంపెనీల కోసం గూగుల్ బిగ్ అప్‌డేట్.. క్రోమ్‌లో స్మార్ట్ AI ఫీచర్
కంపెనీల కోసం గూగుల్ బిగ్ అప్‌డేట్.. క్రోమ్‌లో స్మార్ట్ AI ఫీచర్

Chrome: కంపెనీల కోసం గూగుల్ బిగ్ అప్‌డేట్.. క్రోమ్‌లో స్మార్ట్ AI ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తన బ్రౌజర్ గూగుల్ క్రోమ్'లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్థల కోసం "ఆటో బ్రౌజ్" అనే కొత్త AI ఫీచర్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్‌లో జెమినీటెక్నాలజీని ఉపయోగించి ఓపెన్ చేసిన ట్యాబ్‌ల కాంటెక్స్ట్‌ను అర్థం చేసుకుని ట్రావెల్ బుకింగ్స్, ఫారమ్ ఫిల్లింగ్, మీటింగ్స్ షెడ్యూలింగ్ వంటి పనులను స్వయంగా పూర్తి చేస్తుంది. అలాగే డాక్యుమెంట్స్‌లో ఉన్న సమాచారాన్ని కంపెనీ CRM సిస్టమ్‌లో ఎంటర్ చేయడం,వేర్వేరు ట్యాబ్‌లలో ధరలను పోల్చడం, ఇంటర్వ్యూల ముందు అభ్యర్థుల వివరాలను సమ్మరీ చేయడం, పోటీ కంపెనీల ప్రొడక్ట్ పేజీల నుంచి ముఖ్యమైన డేటాను తీసుకోవడం కూడా ఈ ఫీచర్‌తో సాధ్యమవుతుంది.

వివరాలు 

AI వర్క్ లోడ్ తగ్గించకుండా మరింత పెంచే అవకాశం

అయితే చివరి నిర్ణయం తీసుకునే ముందు మానవ సమీక్ష తప్పనిసరిగా ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. ఈ AI ఫీచర్ ప్రధానంగా పనిలో వేగాన్ని పెంచడం, బోర్ కొట్టించే టాస్క్‌లను తగ్గించడం లక్ష్యంగా తీసుకొచ్చారు. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం AI వర్క్ లోడ్ తగ్గించకుండా మరింత పెంచే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీంతో సంస్థల్లో ఇది ఎలా పనిచేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముందుగా ఈ ఫీచర్ అమెరికాలోని Workspace యూజర్లకు అందుబాటులోకి రానుంది. అలాగే యూజర్లు తమ తరచూ చేసే పనులను "స్కిల్స్"గా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సంస్థల డేటాను AI ట్రైనింగ్‌కు ఉపయోగించమని గూగుల్ హామీ ఇచ్చింది.

వివరాలు 

భద్రతా పరంగా కూడా గూగుల్ కీలక చర్యలు

ఇక భద్రతా పరంగా కూడా గూగుల్ కీలక చర్యలు తీసుకుంది. అనధికార AI టూల్స్‌ను గుర్తించే విధంగా Chrome Enterprise Premium‌ను అప్‌డేట్ చేసింది. IT టీమ్‌లు అనుమానాస్పద బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్, అనుమతి లేని AI సేవలను గుర్తించగలుగుతాయి. కొత్తగా "షాడో IT రిస్క్ డిటెక్షన్" ఫీచర్ ద్వారా సంస్థలో వాడుతున్న అన్ని AI, SaaS సైట్లపై పూర్తి అవగాహన లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన మార్పులు, కొత్త పాలసీలు, సూచనలను AI ఆధారంగా సమ్మరీ రూపంలో అందించనుంది.

Advertisement