Anthropic: ఏఐతో రూపొందించిన కంటెంట్‌కు ఇక అదృశ్య వాటర్‌మార్క్.. ఆంథ్రోపిక్ కొత్త విధానం
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందుతున్న కంటెంట్ రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. దీంతో మనుషులు రూపొందించిన కంటెంట్‌కు, ఏఐ సృష్టించిన కంటెంట్‌కు మధ్య తేడాను గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఏఐ కంటెంట్‌ను గుర్తించడం సులభం చేసేలా ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కంటికి కనిపించని అదృశ్య వాటర్‌మార్క్‌లను ఉపయోగించనుంది. క్లాడ్ ఏఐ మోడల్స్ ద్వారా రూపొందించిన టెక్స్ట్, ఇమేజీలకు ఈ వాటర్‌మార్క్‌లను జత చేయనున్నారు. యూరోపియన్ ఏఐ యాక్ట్‌లోని నిబంధనలకు అనుగుణంగా ఈ విధానాన్ని ఆంథ్రోపిక్ అమల్లోకి తీసుకొచ్చింది.
వివరాలు
కంటికి కనిపించని గుర్తులు..
క్లాడ్ ఏఐ మోడల్స్‌తో రూపొందించిన టెక్స్ట్‌లో మనుషులకు సాధారణంగా గుర్తించలేని విధంగా వాటర్‌మార్క్‌ను పొందుపరుస్తారు.
ప్రత్యేకంగా రూపొందించిన ఈ గుర్తు.. కంటెంట్‌ను ఒకచోట నుంచి మరోచోటికి కాపీ చేసి కొత్త డాక్యుమెంట్‌లో పేస్ట్ చేసినా తొలగిపోదు.
అంతేకాదు, టెక్స్ట్‌పై స్వల్ప స్థాయిలో ఎడిటింగ్ చేసినప్పటికీ వాటర్‌మార్క్ అలాగే కొనసాగుతుంది.
ఇమేజీల విషయంలోనూ ఇదే తరహా విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాల ప్రోవెనెన్స్ మెటాడేటాలో వాటర్‌మార్క్‌ను చేర్చనున్నారు.
దీనివల్ల ఒక చిత్రాన్ని ఏఐతో రూపొందించారా, లేదా ఇప్పటికే ఉన్న చిత్రంలో ఏఐ సహాయంతో మార్పులు చేశారా అనే విషయాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇమేజీకి ఇతర పద్ధతుల్లో మార్పులు చేసినా వాటర్‌మార్క్ ఆధారంగా వాటిని గుర్తించవచ్చు.
వివరాలు
తాజా క్లాడ్ మోడల్స్‌లో అందుబాటులో..
ఇటీవల విడుదలైన అన్ని క్లాడ్ ఏఐ మోడల్స్‌లో ఈ వాటర్‌మార్క్ సదుపాయం ఉంటుందని ఆంథ్రోపిక్ వెల్లడించింది.
అంతేకాదు, ఆ సంస్థ క్లౌడ్ భాగస్వాములైన ఏడబ్ల్యూఎస్ (AWS), గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీల్లోనూ ఈ వాటర్‌మార్క్ విధానం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఒక కంటెంట్‌ను క్లాడ్ ఏఐతో పూర్తిగా రూపొందించారా లేదా అందులో మార్పులు చేశారా అనే విషయాన్ని ఇతరులు గుర్తించేలా ప్రత్యేక డిటెక్షన్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఆంథ్రోపిక్ పేర్కొంది.
అయితే, కంటెంట్‌లో ఈ వాటర్‌మార్క్ కనిపించినంత మాత్రాన అది పూర్తిగా క్లాడ్ ఏఐతోనే రూపొందించిందని నిర్ధారించకూడదని సంస్థ స్పష్టం చేసింది.
ఇతరులు రూపొందించిన కంటెంట్‌లో క్లాడ్‌ను ఉపయోగించి మార్పులు చేసినా వాటర్‌మార్క్ చేరే అవకాశం ఉందని తెలిపింది.
వివరాలు
భారీ మార్పులతో వాటర్‌మార్క్ మాయమయ్యే అవకాశం..
కాబట్టి వాటర్‌మార్క్ ఉన్న కంటెంట్‌ను క్లాడ్ ఏఐ ప్రాసెస్ చేసినట్టుగా మాత్రమే భావించాలని ఆంథ్రోపిక్ వివరించింది.
అయితే కంటెంట్‌లో పెద్ద మొత్తంలో మార్పులు చేసినప్పుడు వాటర్‌మార్క్ తొలగిపోయే అవకాశం కూడా ఉందని ఆంథ్రోపిక్ వెల్లడించింది.
అందువల్ల ఏదైనా కంటెంట్‌లో వాటర్‌మార్క్ కనిపించకపోతే.. అది ఏఐతో రూపొందించలేదని నిర్ధారించకూడదని సూచించింది.
ఇదిలా ఉంటే.. సింథటిక్ ఐడీ (SynthID) పేరుతో గూగుల్ డీప్‌మైండ్ కూడా ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను గుర్తించేందుకు ఇలాంటి అదృశ్య వాటర్‌మార్క్ సాంకేతికతను ఇప్పటికే ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.