Eclipses In 2025: 2025లో ఏర్పడనున్న గ్రహణాలు.. ఎప్పుడు , ఎక్కడ,ఎలా చూడాలంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సంవత్సరం 2025 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి, వాటిలో రెండు సూర్యగ్రహణాలు కాగా, మరి రెండు చంద్రగ్రహణాలు.
అయితే, వీటిలో ఒకటే భారత్‌లో కనిపిస్తుంది అని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ జీవాజీ అంతరిక్ష అధ్యయన కేంద్రం సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రకాష్ గుప్తా తెలిపారు.
వివరాలు
2025 మొదటి గ్రహణం (మార్చి 14)
2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కానీ, ఈ గ్రహణం పగటిపూట జరిగే కారణంగా భారత్‌లో కనిపించే అవకాశం లేదు. అయితే, ఈ చంద్రగ్రహణం అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
2025 రెండవ గ్రహణం (మార్చి 29)
మార్చి 29న పాక్షిక సూర్యగ్రహణం జరుగుతుంది. ఇది కూడా భారత్‌లో కనిపించదు. కానీ ఉత్తర అమెరికా, గ్రీన్‌ల్యాండ్, ఉత్తర అట్లాంటిక్ సముద్రం, యూరప్ మరియు వాయువ్య రష్యా ప్రాంతాల్లో ఈ గ్రహణం కన్పిస్తుంది.
వివరాలు
2025 మూడవ గ్రహణం (సెప్టెంబర్ 7, 8)
సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరిగే చంద్రగ్రహణం మాత్రం భారతదేశంలో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా ఆసియా, యూరప్, అంటార్కటికా, పశ్చిమ పసిఫిక్ సముద్రం, ఆస్ట్రేలియా, బంగాళాఖాతం ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు.
ఈ గ్రహణం రాత్రి 8.58 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున 2.25 గంటలకు ముగుస్తుంది.
2025 నాలుగో గ్రహణం (సెప్టెంబర్ 21, 22)
సెప్టెంబర్ 21, 22 తేదీల్లో సూర్యగ్రహణం జరుగుతుంది. అయితే ఇది భారత్‌లో కనిపించదు. న్యూజిలాండ్, పశ్చిమ అంటార్కటికా వంటి ప్రాంతాల్లో ఈ గ్రహణం స్పష్టంగా చూడవచ్చు అని గుప్తా వివరించారు.