ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. వికీపీడియాకి 1 బిలియన్ డాలర్లు ఎందుకో తెలుసా
X అధినేత, టెస్లా వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో కొత్త చర్చకు తెరలేపారు. వికీపీడియాకు 1 బిలియన్ డాలర్లను గిఫ్టును అందిస్తానని ప్రకటించి సంచలనానికి తెరలేపారు. కానీ దీనికి షరతులను విధించారు. ప్రముఖ గూగుల్ సెర్చ్ ఇంజిన్ వికీపీడియా పేరును డికిపీడియాగా మార్చాలన్నారు. ఈ పని చేస్తే తాను ఒక బిలియన్ డాలర్లు డబ్బును అందజేస్తానన్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్టుకు ఏ యూజర్ చమత్కారంగా స్పందించారు. ఎలాన్ మాస్క్ చెప్పినట్టు పేరు మార్చి, 1 బిలియన్ డాలర్ తీసుకొని, తిరిగి పాత పేరును మార్చుకోవాలని వికీపీడియాకు సూచించారు. దీంతో వెంటనే స్పందించిన మస్క్ తాను సూచించిన పేరు కనీసం ఏడాది పాటు కొనసాగించాలనే నిబంధన ఉంటుందన్నారు.
అప్పట్లో మస్క్ ను విమర్శించిన వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్
మరో పోస్టులో స్పందించిన మస్క్, వికీపీడియా అమ్మకానికి లేదు,జిమ్మీ వేల్స్ నుంచి వ్యక్తిగత విజ్ఞప్తి అని పేర్కొన్న వికీపీడియా హోమ్ పేజీ స్క్రీన్ షాట్ ను ఎలాన్ మస్క్ షేర్ చేశారు. అయితే వికీపీడియా విరాళం ఎందుకు కోరుతోందని ఆయన ప్రశ్నించారు.వికీ ఫౌండేషన్ కు భారీ మొత్తంలో డబ్బు ఎందుకు కావాలో ఎప్పుడైనా ఆలోచించారా అని మస్క్ అడిగారు. వికీపీడియాను ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదని, ఫోన్లోనే మొత్తం టైప్ చేసి, దాన్ని పోస్ట్ చేయవచ్చన్నారు. కానీ అంత డబ్బు ఎందుకో తెలుసుకోవాలని ఉందని రాసుకొచ్చారు.గత మేలో టర్కీ అధ్యక్ష ఎన్నికలకు ముందు Xలో కొంత కంటెంట్ ను పరిమితం చేయాలన్న మస్క్ నిర్ణయాన్ని వికీపీడియా సహ వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ విమర్శించారు.