Loading...
Europe: యూరప్‌ అంతరిక్ష రంగంలో చారిత్రక విజయం.. స్పెక్ట్రమ్‌ రాకెట్‌ సక్సెస్
యూరప్‌ అంతరిక్ష రంగంలో చారిత్రక విజయం.. స్పెక్ట్రమ్‌ రాకెట్‌ సక్సెస్

Europe: యూరప్‌ అంతరిక్ష రంగంలో చారిత్రక విజయం.. స్పెక్ట్రమ్‌ రాకెట్‌ సక్సెస్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన ఇసార్ ఏరోస్పేస్ సంస్థ యూరప్‌లో తొలి పూర్తిస్థాయి వాణిజ్య కక్ష్య రాకెట్ 'స్పెక్ట్రమ్‌'ను విజయవంతంగా ప్రయోగించింది. రెండు దశలతో రూపొందించిన ఈ రాకెట్‌ను నార్వేలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి పంపారు. యూరప్ అంతరిక్ష రంగంలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. 2025 మార్చిలో ఇదే రాకెట్‌ను ప్రయోగించగా.. నింగిలోకి దూసుకెళ్లిన 30 సెకన్లకే సముద్రంలో కూలిపోయింది. ఆ వైఫల్యం తర్వాత చేపట్టిన తాజా ప్రయోగం విజయవంతమైంది.

వివరాలు 

'ఖండాంతర యూరప్‌ నుంచి అంతరిక్షానికి మార్గం తెరిచాం'

ఈ విజయంపై ఇసార్ ఏరోస్పేస్‌ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు డేనియల్ మెట్జ్లర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

''ఈ రోజు ఖండాంతర యూరప్‌ నుంచి అంతరిక్షానికి మార్గం తెరిచాం'' అని ఆయన పేర్కొన్నారు.

వాణిజ్య, ప్రభుత్వ రంగ వినియోగదారులకు ఇది నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని చెప్పారు.

యూరప్‌ ఇప్పుడు సొంతంగా అంతరిక్షాన్ని చేరుకునే సామర్థ్యాన్ని సాధించిందని, యూరప్‌ అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలైందని మెట్జ్లర్‌ తెలిపారు.

వివరాలు 

ప్రభుత్వ సంస్థలపైనే ఆధారపడిన యూరప్

ఇప్పటివరకు యూరప్‌ అంతరిక్ష ప్రయోగాల కోసం ప్రధానంగా ప్రభుత్వ నిధులతో పనిచేసే ఏరియానెస్పేస్‌, అవియో వంటి సంస్థలపై ఆధారపడుతూ వచ్చింది.

ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇసార్ ఏరోస్పేస్‌ విజయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికాను నమ్మదగని మిత్రదేశంగా భావించే పరిస్థితులు ఏర్పడిన వేళ.. యూరప్‌కు సొంతంగా అంతరిక్ష ప్రయోగ సామర్థ్యం ఉండటం కీలకంగా మారింది.

మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత యూరప్‌ రష్యాకు చెందిన సోయుజ్‌ రాకెట్ల సేవలను కోల్పోయింది.

ADVERTISEMENT

వివరాలు 

యూరప్‌ భద్రతకు కూడా ప్రయోజనం: నార్వే మంత్రి

ఈ ప్రయోగం యూరప్‌ అంతరిక్ష రంగానికి పెద్ద ఊతమని నార్వే పరిశ్రమ, వాణిజ్య శాఖ మంత్రి సెసిలీ మైర్‌సెత్‌ అన్నారు.

యూరప్‌కు అంతరిక్షాన్ని చేరుకోవడం మరింత సులభమవుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో నార్వే, యూరప్‌ భద్రతను కూడా ఈ విజయం బలోపేతం చేస్తుందని చెప్పారు.

మానవరహిత 'స్పెక్ట్రమ్‌' రాకెట్‌ను చిన్న, మధ్యస్థ బరువున్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేలా రూపొందించారు.

తాజా ప్రయోగంలో ఐదు చిన్న ఉపగ్రహాలతో పాటు ప్రయాణ సమయంలో నిర్వహించే సాంకేతిక ప్రయోగాన్ని కూడా రాకెట్‌ మోసుకెళ్లింది.

ADVERTISEMENT

వివరాలు 

రెండో ప్రయత్నంలో విజయం

స్పెక్ట్రమ్‌ ప్రయోగం ఇసార్ ఏరోస్పేస్‌కు రెండో ప్రయత్నం. తొలి ప్రయోగం జరిగిన 18 నెలల తర్వాత అదే ప్రయోగ కేంద్రం నుంచి తాజా ప్రయోగాన్ని చేపట్టారు.

2025లో జరిగిన తొలి ప్రయత్నంలో రాకెట్‌ ప్రయోగించిన కొద్దిసేపటికే పేలి సముద్రంలో పడిపోయింది.

అయితే ఆ ప్రయోగం ద్వారా తమకు పెద్ద మొత్తంలో సాంకేతిక సమాచారం లభించిందని, అభివృద్ధి పనులకు అది ఉపయోగపడిందని సంస్థ తెలిపింది.

తాజా ప్రయోగానికి ముందు ఇసార్ ఏరోస్పేస్‌కు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) నుంచి సుమారు 200 మిలియన్ యూరోలు (దాదాపు 232 మిలియన్ డాలర్లు) నిధులు లభించాయి.

ఈ నిధులతో కొత్త రాకెట్ల అభివృద్ధితో పాటు పరీక్షలు, ప్రయోగ మౌలిక వసతులను విస్తరించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూరప్‌లో తొలి వాణిజ్య కక్ష్య రాకెట్‌ ప్రయోగం విజయవంతం

ADVERTISEMENT