Loading...
Planet Nine: ప్లానెట్‌ నైన్‌ జాడ దొరికిందా?.. తొలిసారి కీలక ఆధారాలు
ప్లానెట్‌ నైన్‌ జాడ దొరికిందా?.. తొలిసారి కీలక ఆధారాలు

Planet Nine: ప్లానెట్‌ నైన్‌ జాడ దొరికిందా?.. తొలిసారి కీలక ఆధారాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన సౌర కుటుంబంలో ఉందని భావిస్తున్న 'ప్లానెట్‌ నైన్‌' (Planet Nine) కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న అన్వేషణలో కీలక ముందడుగు పడింది. భూమి, సూర్యుడికి చాలా దూరంలో ఉన్న గ్రహానికి ఉండే స్థాయిలో కాంతి, నెమ్మదైన కదలిక ఉన్న ఓ అత్యంత మసకబారిన వస్తువును పరిశోధకులు గుర్తించారు. దశాబ్దాల క్రితం సేకరించిన ఇన్‌ఫ్రారెడ్‌ పరిశీలనలను విశ్లేషించగా ఈ వస్తువు ఒక సర్వేలో ఓ ప్రాంతంలో కనిపించగా.. 23 ఏళ్ల తర్వాత నిర్వహించిన మరో సర్వేలో కొంత దూరం కదిలినట్లు గుర్తించారు. తైవాన్‌లోని నేషనల్‌ త్సింగ్‌ హువా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు 'పబ్లికేషన్స్‌ ఆఫ్‌ ది ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఆస్ట్రేలియా'లో ప్రచురితమయ్యాయి.

వివరాలు 

అసలు ప్లానెట్‌ నైన్‌ ఉందని ఎందుకు భావిస్తున్నారు?

కోట్లాది ఇన్‌ఫ్రారెడ్‌ మూలాలను విశ్లేషించిన పరిశోధకులు..ప్లానెట్‌ నైన్‌ అయ్యే అవకాశం ఉన్న ఓ వస్తువును గుర్తించారు.

అయితే ఇది ప్లానెట్‌ నైన్‌ అని నిర్ధారించడానికి మరిన్ని ఆధారాలు అవసరమని పరిశోధకులు స్పష్టం చేశారు

ప్రస్తుతానికి ఈ ఖగోళ వస్తువుపై మరింత పరిశోధన చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ప్లానెట్‌ నైన్‌ ఇప్పటికీ ఒక ఊహాజనిత గ్రహమే. ఇప్పటివరకు దాన్ని నేరుగా ఎవరూ గుర్తించలేదు.

అయినప్పటికీ అది ఉనికిలో ఉండొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు బలంగా భావిస్తున్నారు.

సౌర కుటుంబం అంచుల్లో ఉన్న కొన్ని ఖగోళ వస్తువుల కక్ష్యలు సాధారణంగా కాకుండా ఒకే విధంగా వాలిపోయి ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు.

ఏదో పెద్ద వస్తువు గురుత్వాకర్షణ వాటిపై ప్రభావం చూపడం వల్లే ఇలా జరుగుతోందని భావిస్తున్నారు.

వివరాలు 

అసలు ప్లానెట్‌ నైన్‌ ఉందని ఎందుకు భావిస్తున్నారు?

ప్లానెట్‌ నైన్‌ నెప్ట్యూన్‌కు అవతల, భూమికి సూర్యుడి నుంచి ఉన్న దూరానికి వందల రెట్లు దూరంలో ఉండొచ్చని అంచనా.

అక్కడ సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఆ గ్రహాన్ని నేరుగా గుర్తించడం చాలా కష్టం. అయితే గ్రహాలు తమ నుంచి కొంత వేడిని విడుదల చేస్తాయి.

ఈ వేడి ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాల రూపంలో బయటకు వస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు ఇన్‌ఫ్రారెడ్‌ పరిశీలనల సాయంతో ప్లానెట్‌ నైన్‌ కోసం వెతుకుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

1983, 2006 నాటి పరిశీలనలతో అన్వేషణ

టెర్రీ లాంగ్‌ ఫాన్‌, ఆయన బృందం 1983లో ఇన్‌ఫ్రారెడ్‌ ఆస్ట్రానామికల్‌ శాటిలైట్‌ (IRAS), 2006-07లో జపాన్‌కు చెందిన అకారి (AKARI) అంతరిక్ష నౌక నిర్వహించిన ఇన్‌ఫ్రారెడ్‌ సర్వేల సమాచారాన్ని పరిశీలించింది.

ఈ రెండు పరిశీలనల మధ్య దాదాపు 23 ఏళ్ల వ్యవధి ఉండటంతో.. ఇంత దూరంలో ఉన్న ఓ గ్రహం కాలక్రమంలో ఎంత నెమ్మదిగా కదులుతుందో తెలుసుకునే అవకాశం లభించింది.

సుమారు 500 నుంచి 700 ఆస్ట్రానమికల్‌ యూనిట్ల దూరంలో,భూమి కంటే 7 నుంచి 17 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన వస్తువు కోసం పరిశోధకులు వెతికారు.

దాని కాంతి, స్థానం, ఇన్‌ఫ్రారెడ్‌ లక్షణాలను పరిశీలించారు. తొలుత 22 సాధ్యమైన జతలను గుర్తించారు. అనంతరం వాటిని 13కు తగ్గించారు.

ADVERTISEMENT

వివరాలు 

వెంటనే ప్లానెట్‌ నైన్‌గా ఎందుకు ప్రకటించలేదు?

చివరికి ఒక్క ఖగోళ వస్తువే మంచి అభ్యర్థిగా కనిపించింది. IRAS, AKARI పరిశీలనల మధ్య 23 ఏళ్లలో అది 47.46 ఆర్క్‌ నిమిషాలు కదిలినట్లు గుర్తించారు.

సాధ్యమైన అభ్యర్థిని గుర్తించినప్పటికీ శాస్త్రవేత్తలు దీన్ని వెంటనే ప్లానెట్‌ నైన్‌గా ప్రకటించడం లేదు.

సౌర కుటుంబం వెలుపలి ప్రాంతాల్లోని ఇతర ఖగోళ వస్తువుల అసాధారణ కక్ష్యలకు కారణమయ్యే స్థాయిలో ఈ వస్తువు ఉండాలంటే.. అది సరైన కక్ష్యలో ప్రయాణిస్తోందో లేదో నిర్ధారించాలి.

కేవలం రెండు ఇన్‌ఫ్రారెడ్‌ పరిశీలనల్లో కనిపించినంత మాత్రాన అది ప్లానెట్‌ నైన్‌ అని చెప్పలేమని పరిశోధకులు చెబుతున్నారు.

వివరాలు 

వెంటనే ప్లానెట్‌ నైన్‌గా ఎందుకు ప్రకటించలేదు?

ఈ వస్తువు నిజంగా ప్లానెట్‌ నైన్‌ అయ్యే అవకాశముందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి చిలీలోని 4 మీటర్ల బ్లాంకో టెలిస్కోప్‌పై ఉన్న డార్క్‌ ఎనర్జీ కెమెరాతో మరిన్ని పరిశీలనలు చేయాలని టెర్రీ లాంగ్‌ ఫాన్‌ బృందం సూచించింది.

ఆ పరిశీలనల్లో ఈ వస్తువు కదులుతున్న కక్ష్యను నిర్ధారించగలిగితే.. ప్లానెట్‌ నైన్‌ అన్వేషణలో ఇది మరింత కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT