
Ghibli-style AI images: ఘిబ్లీ మ్యాజిక్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ట్రెండ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీలో ఇటీవల విడుదలైన తాజా ఇమేజ్ జనరేటర్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్‌గా మారింది.
ముఖ్యంగా స్టూడియో ఘిబ్లీ శైలిలో రూపొందించిన ఈ ఏఐ జనరేటెడ్ చిత్రాలు, మీమ్స్ సోషల్ మీడియాను ఓవరటేక్ చేస్తున్నాయి.
యూజర్లు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరుల ముఖాలను ఈ జనరేటర్ ద్వారా రూపొందించి ప్లాట్‌ఫామ్‌లను నింపేస్తున్నారు.
ఈ కొత్త ట్రెండ్‌ను వ్యాపార సంస్థలు కూడా సద్వినియోగం చేసుకుంటూ, తమ బ్రాండింగ్ కోసం ఈ శైలిలో ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయి.
బుధవారం విడుదలైన ఈ ఇమేజ్ జనరేటర్ జపనీస్ యానిమేషన్ స్టూడియో 'స్టూడియో ఘిబ్లీ' ప్రేరణతో అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌ను రూపొందిస్తోంది.
యూజర్లు తమ సృజనాత్మకతను వ్యక్తీకరిస్తూ ఎక్స్ (Twitter) వంటి ప్లాట్‌ఫామ్‌లను ఈ కంటెంట్‌తో ముంచెత్తుతున్నారు.
Details
ఘిబ్లీ అంటే ఏమిటి?
'ఘిబ్లీ' అనే పదం 'లిబియన్ అరబిక్ భాషలో ఎడారి వేడి గాలికి సూచిక'.
జపాన్‌కు చెందిన ప్రసిద్ధ యానిమేషన్ స్టూడియో 'స్టూడియో ఘిబ్లీ' 1985లో హయావో మియాజాకి, ఇసావో టకహట, తోషియో సుజుకి లాంటి దిగ్గజాలు స్థాపించారు.
ఈ స్టూడియో చేతితో గీసిన అద్భుతమైన యానిమేషన్, విపులమైన బ్యాక్‌గ్రౌండ్స్, భావోద్వేగపూరిత కథల కోసం ప్రఖ్యాతి గాంచింది.
ఈ యానిమేటెడ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు.
Details
ఓపెన్‌ఏఐపై పెరుగుతున్న ఒత్తిడి
ఈ ట్రెండ్ విపరీతమైన ప్రజాదరణ పొందుతుండటంతో ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ గురువారం మాట్లాడుతూ, యూజర్లు అత్యధికంగా ఘిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేషన్‌ను వాడుతున్న కారణంగా కంపెనీ వనరులపై తీవ్ర ప్రభావం పడిందని వెల్లడించారు.
ముఖ్యంగా 'జీపీయూలు కరిగిపోతున్నాయి!' అని వ్యాఖ్యానించారు. అందువల్ల, ఈ ఫీచర్ వినియోగంపై తాత్కాలికంగా స్పీడ్ లిమిట్స్ విధిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఈ ఇమేజ్ జనరేటర్‌ను ఉచితంగానే అందుబాటులో ఉంచుతామని కూడా స్పష్టం చేశారు.