iPhone New Feature : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. నెట్‌వర్క్ లేకుండానే ఫొటోలు, మ్యాప్‌లు షేర్ చేసే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ త్వరలోనే ఐఫోన్ వినియోగదారుల కోసం మరొక విప్లవాత్మక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఇంటర్నెట్ లేకుండానే మ్యాప్‌లను షేర్ చేయడం, ఫొటోలను పంపడం వంటి పనులు చేయగలిగే సరికొత్త సాంకేతికతపై సంస్థ పని చేస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో, ఏ మోడళ్లకు అందుబాటులోకి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
ఇంటర్నెట్ లేకుండానే షేరింగ్ సౌకర్యం
ఐఫోన్ యూజర్లకు పెద్ద ఊరట కలిగించే ఈ కొత్త ఫీచర్ ద్వారా, మొబైల్ నెట్‌వర్క్ లేదా Wi-Fi లేకున్నా కూడా మ్యాప్‌లు, ఫొటోలను సులభంగా పంపించుకోవచ్చు. నివేదికల ప్రకారం, రాబోయే ఐఫోన్లలో ఈ ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఆపిల్ ఉంది. ఏ డివైస్‌లకు సపోర్ట్? ఈ కొత్త ఫీచర్ ప్రధానంగా ఐఫోన్ 14 తర్వాతి మోడళ్లకు, అలాగే ఆపిల్ వాచ్ ఆల్ట్రా 3కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న శాటిలైట్ సపోర్ట్ ఫీచర్లను మరింత విస్తరించేలా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి స్థాయి ఆమోదం రావాల్సి ఉంది. అమెజాన్‌తో జరుగుతున్న ఈ ఒప్పందం 2027 నాటికి పూర్తి అవుతుందని అంచనా.
వివరాలు
ఇప్పటికే ఉన్న శాటిలైట్ ఫీచర్లు
ఈ సేవలు లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్ నెట్‌వర్క్ ఆధారంగా పనిచేయనున్నాయి. ప్రస్తుతం ఆపిల్ అందిస్తున్న కొన్ని శాటిలైట్ ఆధారిత సేవలు ఇవి ఎమర్జెన్సీ SOS 'Find My' ద్వారా లొకేషన్ షేరింగ్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సాధారణ మెసేజింగ్ ఈ ఫీచర్లు Wi-Fi లేదా మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇవి ప్రస్తుతం ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
రాబోయే అప్డేట్లు, టైమ్‌లైన్
ఈ కొత్త డీల్ ద్వారా ఆపిల్, అమెజాన్ కలిసి ఈ సేవలను మరింత విస్తరించనున్నాయి. రాబోయే ఐఫోన్లు iOS 27తో రావచ్చని అంచనా. ఈ అప్‌డేట్ వచ్చే జూన్‌లో బీటా వెర్షన్‌గా విడుదలై, సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్లతో పాటు అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశముంది. కొత్త ఫీచర్లలో ఏముంటాయి? ప్రస్తుతం శాటిలైట్ ఫీచర్లు తక్కువ బ్యాండ్‌విడ్త్ కారణంగా పరిమితంగానే ఉన్నాయి. శాటిలైట్ ద్వారా 5G కనెక్టివిటీ ఆపిల్ మ్యాప్స్ సపోర్ట్‌తో మ్యాప్ షేరింగ్ మెసేజెస్ ద్వారా ఫొటోలను పంపే సౌకర్యం థర్డ్ పార్టీ యాప్‌లకు కూడా శాటిలైట్ కనెక్టివిటీ వినియోగం ఈ అప్‌గ్రేడ్‌లతో, నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఐఫోన్ వినియోగం మరింత విస్తృతంగా మారనుంది.