Loading...
Google DeepMind: వాట్సాప్ చాటింగ్ సేఫ్.. గూగుల్ డీప్‌మైండ్ పరిశోధనలో వెల్లడి
వాట్సాప్ చాటింగ్ సేఫ్.. గూగుల్ డీప్‌మైండ్ పరిశోధనలో వెల్లడి

Google DeepMind: వాట్సాప్ చాటింగ్ సేఫ్.. గూగుల్ డీప్‌మైండ్ పరిశోధనలో వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్‌లో మనం చేసే చాటింగ్ ఎంతవరకు సురక్షితం? ఇతరులు మన వ్యక్తిగత సందేశాలను హ్యాక్ చేసే అవకాశం ఉందా? ఇలాంటి సందేహాలకు గూగుల్ డీప్‌మైండ్ పరిశోధన సమాధానమిచ్చింది. వాట్సాప్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లు ఉపయోగించే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) వ్యవస్థను పరిశీలించిన డీప్‌మైండ్.. వాటి భద్రతను గణితశాస్త్రపరంగా నిరూపించినట్లు వెల్లడించింది. ఆల్ఫాప్రూఫ్ (AlphaProof) అనే ఏఐ ఫ్రేమ్‌వర్క్ సాయంతో ప్రత్యేక పరిశోధకుల బృందం ఈ పరీక్షలు నిర్వహించింది. సిగ్నల్ యాప్ ఉపయోగించే క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్‌ను మెషిన్ కోడ్ స్థాయి వరకు పరిశీలించి ధ్రువీకరించింది. ఈ విషయాన్ని గూగుల్ డీప్‌మైండ్ శాస్త్రవేత్త స్వరాట్ చౌదరి ఎక్స్ వేదికగా వెల్లడించారు.

వివరాలు 

ఆల్ఫాప్రూఫ్ ఏఐ వ్యవస్థ సాయంతో నాలుగు వారాల్లోనే పూర్తి

వాట్సాప్, సిగ్నల్ యాప్‌లు ఉపయోగించే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థలో గణితశాస్త్రపరంగా ఎలాంటి లోపాలు లేవని తమ పరిశోధనలో నిరూపించినట్లు తెలిపారు.

ఈ యాప్‌ల భద్రతా వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా ఉందని, వాటిలోని సందేశాలను ఇతరులు హ్యాక్ చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

సాధారణంగా ఒక సాఫ్ట్‌వేర్ కోడ్ గణితశాస్త్రపరంగా పూర్తిగా భద్రంగా ఉందని నిరూపించడానికి నిపుణులకు దశాబ్దాల సమయం పట్టవచ్చు.

అయితే ఆల్ఫాప్రూఫ్ ఏఐ వ్యవస్థ సాయంతో గూగుల్ డీప్‌మైండ్ ఈ ప్రక్రియను కేవలం నాలుగు వారాల్లోనే పూర్తి చేసింది.

మానవ నిపుణుల పర్యవేక్షణలో పనిచేసిన ఏఐ మోడళ్లు సాఫ్ట్‌వేర్ కోడ్‌ను విస్తృతంగా తనిఖీ చేశాయి.

మొత్తం కోడ్‌బేస్‌లో కేవలం ఒక శాతం భాగాన్ని మాత్రమే నిపుణులు స్వయంగా పరిశీలించారు.

వివరాలు 

కోడ్‌లో రెండు బగ్‌లు 

ఏఐ వ్యవస్థ పనితీరుపై ఎలాంటి సందేహాలు లేకుండా ఉండేందుకు పరిశోధకులు అదే కోడ్‌లో ఉద్దేశపూర్వకంగా రెండు బగ్‌లను ప్రవేశపెట్టారు.

వాటిని ఏఐ విజయవంతంగా గుర్తించింది. దీంతో కోడ్‌లోని లోపాలను గుర్తించే సామర్థ్యం ఏఐకి ఉందని నిర్ధారణైంది.

ఈ పరిశోధన ద్వారా సాఫ్ట్‌వేర్ కోడ్ గణితశాస్త్రపరంగా లోపరహితంగా ఉందని వెల్లడైంది.

తద్వారా వాట్సాప్, సిగ్నల్ వంటి యాప్‌లలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రాముఖ్యత, భద్రత మరోసారి స్పష్టమయ్యాయి.

ADVERTISEMENT