Gemini 3.8 Flash: కోడింగ్ రేసులో గూగుల్ దూకుడు.. త్వరలో జెమినీ 3.8 ఫ్లాష్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ కొంత వెనుకంజలో ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆ సంస్థ మరోసారి దూకుడు పెంచుతోంది. ముఖ్యంగా ఏఐ ఆధారిత కోడింగ్ విభాగంలో ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌కు గట్టి పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కొత్త జెమినీ మోడల్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 'వాల్‌స్ట్రీట్ జర్నల్' కథనం ప్రకారం.. ప్రస్తుతం అంతర్గతంగా 'స్కిమాకి' (Skimaki) అనే పేరుతో వ్యవహరిస్తున్న ఈ మోడల్‌కు 'జెమినీ 3.8 ఫ్లాష్'గా నామకరణం చేసి విడుదల చేసే అవకాశం ఉంది.
వివరాలు
సెప్టెంబర్ 2నే విడుదల?
జెమినీ 3.8 ఫ్లాష్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేసే అవకాశముందని నివేదిక వెల్లడించింది.
ఇప్పటికే గూగుల్ సిబ్బంది ఈ మోడల్‌ను అంతర్గతంగా పరీక్షించినట్లు సమాచారం.
గూగుల్‌కు చెందిన కోడింగ్ ప్లాట్‌ఫామ్ 'జెట్‌స్కీ'లో జరిగిన అంతర్గత పరీక్షల్లో కొంతమంది ఇంజినీర్లు ఈ కొత్త మోడల్ పనితీరును ఆంథ్రోపిక్ ఓపస్ మోడల్ కంటే మెరుగ్గా అంచనా వేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఫ్లాష్ మోడళ్ల ప్రత్యేకతేంటి?
అయితే జెమినీ 3.8 ఫ్లాష్.. గూగుల్ నుంచి రానున్న తదుపరి ఫ్రాంటియర్ మోడల్ కాదని తెలుస్తోంది.
ఫ్లాష్ సిరీస్ మోడళ్లను సాధారణంగా చిన్న పరిమాణంలో రూపొందిస్తారు.
దీంతో ఇవి వేగంగా స్పందించడంతో పాటు తక్కువ ఖర్చుతో పనిచేసేలా ఉంటాయి.
అంతేకాదు.. వీటిలో మార్పులు చేయడం, ఒకేసారి భిన్నమైన విధానాలను పరీక్షించడం కూడా సులభంగా ఉంటుంది.
ఈ కారణంగానే గూగుల్ ఇటీవలి కాలంలో ఫ్లాష్ మోడళ్లపై వరుసగా ప్రయోగాలు చేస్తోంది.
జులైలో జెమినీ 3.6 ఫ్లాష్‌ను విడుదల చేసిన సంస్థ.. కేవలం మూడు వారాల వ్యవధిలోనే 3.7 ఫ్లాష్‌ను తీసుకొచ్చింది.
వివరాలు
గూగుల్‌కు ఎందుకంత కీలకం?
ప్రస్తుతం గూగుల్‌కు జెమినీ 3.8 ఫ్లాష్ కీలకమైన మోడల్‌గా మారినట్లు తెలుస్తోంది.
జెమినీ 3.5 ప్రో అంతర్గత కోడింగ్ ప్రమాణాలను చేరుకోలేకపోవడంతో.. దాని విడుదల ఆలస్యమైనట్లు సమాచారం.
మరోవైపు గూగుల్ తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా భావిస్తున్న జెమినీ 4 శిక్షణలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. ప్రస్తుతం పోస్ట్-ట్రైనింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న పోటీ
కోడింగ్ ఏఐ మార్కెట్‌లో పోటీ కూడా గతంలో కంటే తీవ్రంగా మారింది.
ఆంథ్రోపిక్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో బలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాయి.
మరోవైపు ఎలాన్ మస్క్‌కు చెందిన సంస్థ నుంచి గ్రోక్ కోడింగ్ మోడళ్లు, మెటా నుంచి మ్యూజ్ కోడ్ వంటి ఏఐ కోడింగ్ ఏజెంట్లు అందుబాటులోకి వచ్చాయి.
వివరాలు
ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌పై దృష్టి
దీంతో ప్రత్యర్థి సంస్థలకు దీటుగా గూగుల్ కొత్త మోడళ్లను మరింత వేగంగా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జెమినీ యాప్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వినియోగదారుల సంఖ్యను దాటినప్పటికీ.. ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌లో మాత్రం గూగుల్‌కు సవాళ్లు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో జెమినీ 3.8 ఫ్లాష్ ద్వారా కోడింగ్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని గూగుల్ ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే కోడింగ్ ఏఐలో పోటీ సంస్థలు వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో.. జెమినీ 3.8 ఫ్లాష్ గూగుల్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుంది? కోడింగ్ రంగంలో మళ్లీ ఆధిపత్యాన్ని సాధించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.