Google Chrome: గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు వెర్టికల్ ట్యాబ్స్ సపోర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వెర్టికల్ ట్యాబ్స్ ఫీచర్ చివరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను మొదటగా ఆర్క్ బ్రౌజర్ తరహాలో ఇప్పుడు క్రోమ్‌లో కూడా అందిస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా బ్రౌజర్‌లో ట్యాబ్స్‌ను పైభాగంలో కాకుండా పక్కవైపు (సైడ్‌లో) చూపించవచ్చు. దీంతో ఎక్కువ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు వాటిని సులభంగా వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా ఒకేసారి చాలా ట్యాబ్స్ ఉపయోగించే యూజర్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వివరాలు
ఎలా యాక్టివేట్ చేయాలి?
వెర్టికల్ ట్యాబ్స్ ఫీచర్‌ను ఉపయోగించడానికి క్రోమ్ విండోపై రైట్ క్లిక్ చేసి "Show Tabs Vertically" అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత అవసరం లేకపోతే తిరిగి డిసేబుల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్‌తో ఎన్ని ట్యాబ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో బ్రౌజింగ్ అనుభవం మరింత మెరుగవుతుందని గూగుల్ చెబుతోంది. గతంలో ఈ ఫీచర్ పరీక్ష దశలోనే ఉండిపోయినప్పటికీ, ఇప్పుడు ఇతర బ్రౌజర్లు, ముఖ్యంగా ఏఐ ఆధారిత బ్రౌజర్ల ప్రభావంతో క్రోమ్‌లో కూడా దీన్ని తీసుకువచ్చింది.
వివరాలు
రీడింగ్ మోడ్‌లో కొత్త మార్పులు
వెర్టికల్ ట్యాబ్స్‌తో పాటు క్రోమ్ రీడింగ్ మోడ్‌లో కూడా మార్పులు చేసింది. ఇప్పుడు ఫుల్ పేజ్ ఇంటర్‌ఫేస్‌తో రీడింగ్ మోడ్ అందుబాటులోకి వస్తోంది. దీంతో స్క్రీన్‌పై ఉండే అప్రయోజక అంశాలు తగ్గి, టెక్స్ట్‌పై ఫోకస్ చేయడం సులభమవుతుంది. ప్రస్తుతం అనేక వెబ్‌సైట్లలో ప్రకటనలు, పాప్-అప్స్ ఎక్కువగా ఉండటం వల్ల యూజర్లకు చదవడం కష్టంగా మారింది. ఈ సమస్యను తగ్గించేందుకు ఈ కొత్త రీడింగ్ మోడ్ ఉపయోగపడనుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ అందరికీ బాగా కనెక్ట్ కానుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.