Page Loader
అలర్ట్: గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవో, ఎడ్జ్ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఇబ్బందులు: అప్డేట్ ఒక్కటే మార్గం 
సెక్యూరిటీ ప్యాచెస్ విడుదల చేసిన గూగుల్ క్రోమ్, ఎడ్జ్, బ్రేవ్

అలర్ట్: గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవో, ఎడ్జ్ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఇబ్బందులు: అప్డేట్ ఒక్కటే మార్గం 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 14, 2023
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, బ్రేవ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఇబ్బందులను సరిచేసేందుకు ఆయా కంపెనీలు ప్యాచెస్ విడుదల చేసాయని స్టాక్ డైరీ తెలియజేసింది. అందుకే గూగుల్ క్రోమ్ సహా అన్నింటినీ అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అప్డేట్ చేయకపోతే హ్యాకర్ల వలలో చిక్కుకునే అవకాశం ఉందట. వెబ్ పి (webp) ఇమేజ్ కోడ్ ద్వారా కంప్యూటర్ మొత్తాన్ని హ్యాకర్లు తమ చేతుల్లోకి తీసేసుకుంటున్నారని, దీనివల్ల పెనుముప్పు పొంచి ఉందని నిస్ట్(NIST) తెలియజేసింది.

Details

సెక్యూరిటీ ఇబ్బందులు క్లియర్ అయిన వెర్షన్లు 

Google: Chrome version 116.0.5846.187 (Mac / Linux); Chrome version 116.0.5845.187/.188 (Windows) Mozilla: Firefox 117.0.1; Firefox ESR 102.15.1; Firefox ESR 115.2.1; Thunderbird 102.15.1; Thunderbird 115.2.2 Microsoft: Edge version 116.0.1938.81 Brave: Brave Browser version 1.57.64 ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ యాప్స్ సిగ్నల్, బండిసాఫ్ట్ కి చెందిన హనీ వ్యూ మొదలగు కంపెనీలు సెక్యూరిటీ ఇబ్బందులను సరిచేయడానికి ప్యాచెస్ ని విడుదల చేసాయి. Affinity, Gimp, LibreOffice, Telegram వంటి కంపెనీలు సెక్యూరిటీ ఇబ్బందుల వల్ల ప్రభావితం అవుతాయని స్టాక్ డైరీ పేర్కొంది.