Android earthquake alerts: 200కు పైగా దేశాలకు గూగుల్ భూకంప హెచ్చరికలు.. ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ వ్యవస్థను మరింత విస్తరిస్తోంది. ఇప్పటివరకు 98 దేశాలు,ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఈ సేవలను తాజాగా 200కు పైగా దేశాలు, ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించింది. దీంతో పాటు భూకంప హెచ్చరికల్లో మరిన్ని వివరాలను అందించనుంది.భూకంపం వల్ల ఎలాంటి ప్రభావం ఉండవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను వినియోగదారులు సులభంగా తెలుసుకునేలా ఈ మార్పులు చేపడుతోంది. గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2021లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 100 కోట్లకు పైగా భూకంప హెచ్చరికలు పంపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఆధారిత భూకంప గుర్తింపు వ్యవస్థగా గూగుల్ దీనిని పేర్కొంది. తాజాగా పనామా, గ్వాటెమాలా వంటి ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరిస్తోంది.
వివరాలు
సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవకాశం
ఈ విస్తరణపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ (X) వేదికగా స్పందించారు.
ఈ ఏడాది వెనిజులాలో సంభవించిన భూకంపాల సమయంలో ఈ సాంకేతికత ఉపయోగపడిందని తెలిపారు.
భూకంప కేంద్రానికి దూరంగా ఉన్న లక్షలాది మందికి ముందుగానే హెచ్చరికలు అందాయని, దీంతో భూమి కంపించడం ప్రారంభమయ్యేలోపు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవకాశం లభించిందని వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సుందర్ పిచాయ్ చేసిన ట్వీట్
Since launching in 2021, our Android Earthquake Alerts System has sent 1B+ alerts. Now we’re expanding the system from 98 to nearly 200 countries and regions.
— Sundar Pichai (@sundarpichai) October 15, 2026
Proud how this technology can help in moments that really matter. As one example, when the devastating earthquakes hit…
వివరాలు
భూకంప హెచ్చరికల్లో మరిన్ని వివరాలు
ఆండ్రాయిడ్ ఫోన్లలో అందించే 'Be Ready' భూకంప హెచ్చరికను గూగుల్ మరింత మెరుగుపరుస్తోంది.
భూకంపం సంభవించే అవకాశం ఉన్నప్పుడు దాని తీవ్రతను అంచనా వేసుకోవడానికి, తదుపరి ఏం చేయాలో తెలుసుకోవడానికి ఉపయోగపడే సమాచారాన్ని ఇందులో చేర్చనుంది.
రాబోయే కొన్ని నెలల్లో ఈ హెచ్చరికలో భూమి కంపించిన పరిధిని చూపించే మ్యాప్, భూకంప తీవ్రతకు సంబంధించిన అంచనా, తీసుకోవాల్సిన భద్రతా చర్యలు అందుబాటులోకి రానున్నాయి.
దీనికి సంబంధించిన మరింత సమాచారం లభించినప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక బటన్‌ను కూడా జోడించనుంది.
దీంతో కేవలం హెచ్చరికను చూసి వదిలేయకుండా, పరిస్థితిని అర్థం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.
వివరాలు
ఆండ్రాయిడ్‌లో మూడు రకాల భూకంప హెచ్చరికలు
భూమి కంపించే తీవ్రతను బట్టి ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ వ్యవస్థ మూడు రకాల హెచ్చరికలను అందిస్తుంది.
స్వల్పంగా భూమి కంపించే అవకాశం ఉన్నప్పుడు 'Be Aware' హెచ్చరిక కనిపిస్తుంది.
మరింత బలంగా కంపించే పరిస్థితుల్లో 'Be Ready' నోటిఫికేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది.
మధ్యస్థాయి నుంచి తీవ్రమైన ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు 'Take Action' హెచ్చరిక పూర్తి స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఈ సమయంలో వెంటనే తీసుకోవాల్సిన భద్రతా చర్యలను సూచిస్తుంది.
వివరాలు
ఆండ్రాయిడ్‌లో మూడు రకాల భూకంప హెచ్చరికలు
ఈ వ్యవస్థ భూకంప ప్రకంపనలను గుర్తించడానికి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తుంది.
గుర్తించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బలమైన ప్రకంపనలు చేరుకునే ముందే వినియోగదారులకు హెచ్చరికలు పంపేందుకు ప్రయత్నిస్తుంది.
కొన్ని సెకన్ల ముందస్తు సమాచారం కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని గూగుల్ చెబుతోంది.
తాజా విస్తరణ, కొత్త వివరాల ద్వారా మరింత మందికి భూకంప హెచ్చరికలు అందుబాటులోకి రావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వాటి ఉపయోగం పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
అయితే భూకంప స్వభావం, వినియోగదారులు ఉన్న ప్రాంతాన్ని బట్టి ముందస్తు హెచ్చరిక అందే సమయం మారవచ్చు.