LOADING...
Google: AI డీప్‌ఫేక్ కాల్స్‌కు చెక్.. కుటుంబ సభ్యుల పేరుతో వచ్చే మోసాలను గుర్తించే గూగుల్ కొత్త ఫీచర్
AI డీప్‌ఫేక్ కాల్స్‌కు చెక్.. గూగుల్ కొత్త Android ఫీచర్

Google: AI డీప్‌ఫేక్ కాల్స్‌కు చెక్.. కుటుంబ సభ్యుల పేరుతో వచ్చే మోసాలను గుర్తించే గూగుల్ కొత్త ఫీచర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా కొత్త రూపాలు దాల్చుతున్నాయి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల పేరుతో కాల్ చేసి అత్యవసర పరిస్థితి అంటూ డబ్బులు అడిగే మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి AI డీప్‌ఫేక్ కాల్స్‌ను గుర్తించేందుకు గూగుల్ కొత్త భద్రతా ఫీచర్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొస్తోంది. మంగళవారం ఈ ఫీచర్‌ను ప్రకటించిన గూగుల్, AI ఆధారిత వాయిస్ క్లోనింగ్ మోసాలను అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపింది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా యాక్టివ్‌గా ఉండి, వినియోగదారులు ఎలాంటి ప్రత్యేక సెట్టింగులు చేయాల్సిన అవసరం లేకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంది.

వివరాలు 

ఎలా పనిచేస్తుందంటే..

మీ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వ్యక్తి ఫోన్ చేస్తే, అతను నిజంగానే తన ఫోన్ నుంచే కాల్ చేస్తున్నాడా లేదా అన్న విషయాన్ని ఈ ఫీచర్ ధృవీకరిస్తుంది. కాల్ చేసే వ్యక్తి, కాల్ స్వీకరించే వ్యక్తి ఇద్దరూ "Phone by Google" యాప్‌ను ఉపయోగిస్తుంటే,కాల్‌తో పాటు ఒక సురక్షిత ధృవీకరణ సంకేతం (Verification Signal) కూడా పంపబడుతుంది. మీ ఫోన్ ఆ సంకేతాన్ని తనిఖీ చేసి కాల్‌ను నమ్మదగినదిగా గుర్తిస్తుంది. ఒకవేళ మోసగాడు ఫోన్ నంబర్‌ను స్పూఫ్ చేసి,AI ద్వారా రూపొందించిన స్వరంతో కాల్ చేస్తే ఆ ధృవీకరణ సంకేతం ఉండదు. అటువంటి సందర్భాల్లో గూగుల్ వ్యవస్థ అసలు ఫోన్‌తో మరోసారి తనిఖీ చేస్తుంది.

వివరాలు 

RCS ఆధారంగా ఈ సాంకేతికత పనిచేస్తుంది 

అసలు యజమాని కాల్ చేయడం లేదని నిర్ధారణ అయితే, వెంటనే కాల్‌ను నిలిపివేయాలని హెచ్చరిక సందేశం వినియోగదారుడి స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రస్తుతం చాలా మంది తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌పై అప్రమత్తంగా ఉంటుండటంతో, సైబర్ నేరగాళ్లు పరిచయమైన వ్యక్తుల నంబర్లను అనుకరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. AI వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ వల్ల ఈ మోసాలు మరింత నమ్మదగినవిగా మారుతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికే గూగుల్ ఈ కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతికత Rich Communication Services (RCS) ఆధారంగా పనిచేస్తుందని గూగుల్ వెల్లడించింది. భవిష్యత్తులో ఇతర యాప్‌లు, సేవలు కూడా ఈ ధృవీకరణ వ్యవస్థను ఉపయోగించే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

వివరాలు 

ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

ఆండ్రాయిడ్ 12 లేదా అంతకంటే తాజా వెర్షన్‌లలో పనిచేసే"Phone by Google"యాప్ ద్వారా ఈ ఫీచర్ ఈ నెల నుంచే ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా విడుదల కానుంది. మొదటగా గూగుల్ Pixel స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చి,తర్వాత ఇతర ఆండ్రాయిడ్ పరికరాలకు విస్తరించనుంది. ఇదే సందర్భంగా గూగుల్ మరో ఆసక్తికరమైన AI ఫీచర్‌ను కూడా ప్రకటించింది.Google Photosలో కొత్త "వర్చువల్ వార్డ్‌రోబ్"ఫీచర్‌ను తీసుకురానుంది. ఫోటోలైబ్రరీలో కనిపించే దుస్తులను గుర్తించి వర్గీకరించే ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ దుస్తుల కలెక్షన్‌ను సులభంగా పరిశీలించడంతో పాటు వివిధ కాంబినేషన్లను వర్చువల్‌గా ప్రయత్నించవచ్చు. ఈఫీచర్ వచ్చే వారం నుంచి అమెరికా,భారత్,బ్రెజిల్ దేశాల్లో Android 10 లేదా అంతకంటే పై వెర్షన్‌లను ఉపయోగించే అర్హత కలిగిన వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Advertisement