Loading...
Google: గూగుల్ నుంచి అత్యంత కచ్చితమైన ఏఐ వాతావరణ మోడల్.. WeatherNext 3 లాంచ్
గూగుల్ నుంచి అత్యంత కచ్చితమైన ఏఐ వాతావరణ మోడల్.. WeatherNext 3 లాంచ్

Google: గూగుల్ నుంచి అత్యంత కచ్చితమైన ఏఐ వాతావరణ మోడల్.. WeatherNext 3 లాంచ్

వ్రాసిన వారు Moogati Shabari
Sep 04, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

వాతావరణ పరిస్థితులను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు గూగుల్ సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్‌ను తీసుకొచ్చింది. WeatherNext 3 పేరుతో రూపొందించిన ఈ మోడల్.. మారుతున్న వాతావరణ పరిస్థితులను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడంతో పాటు, తరచూ వాతావరణ అంచనాలను అందించనుంది. డీప్ లెర్నింగ్ టెక్నాలజీ ఆధారంగా వాతావరణ అంచనాల్లో చోటుచేసుకుంటున్న విస్తృత మార్పుల్లో భాగంగా గూగుల్ ఈ కొత్త మోడల్‌ను అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో WeatherNext 3ను గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, జెమినీ సేవల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

వివరాలుు

ఇతర మోడళ్లను అధిగమించిన WeatherNext 3

WeatherNext 3 ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటింది.

ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలను పోల్చేందుకు Brightband అభివృద్ధి చేసిన Operational WeatherBench పరీక్షలో ఈ మోడల్.. ఇతర మోడళ్ల కంటే మెరుగైన ఫలితాలను సాధించింది.

మైక్రోసాఫ్ట్, NVIDIA, యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ (ECMWF)కు చెందిన ఇతర డీప్ లెర్నింగ్ మోడళ్లను WeatherNext 3 అధిగమించింది.

అంతేకాదు.. అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్, ECMWF అందించే సంప్రదాయ వాతావరణ అంచనాల కంటే కూడా ఈ కొత్త మోడల్ మెరుగైన పనితీరు కనబరిచింది.

వివరాలు

ఏఐ వాతావరణ అంచనాల్లోని సమస్యలకు పరిష్కారం

ప్రస్తుతం ఉన్న ఏఐ ఆధారిత వాతావరణ అంచనా మోడళ్లపై పలు విమర్శలు ఉన్నాయి.

ఇవి సాధారణంగా 15 నుంచి 25 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే అంచనాలు ఇవ్వడం, వర్షపాతాన్ని కచ్చితంగా అంచనా వేయలేకపోవడం, ప్రభుత్వ సంస్థలు అందించే నిర్దిష్ట ఫార్మాట్‌లోని డేటాపైనే ఎక్కువగా ఆధారపడటం వంటి సమస్యలు ఉన్నాయి.

WeatherNext 3 ఈ మూడు సమస్యలను అధిగమించేలా రూపొందించారు.

ఇది 5 కిలోమీటర్ల వరకు సూక్ష్మమైన రిజల్యూషన్‌తో వాతావరణాన్ని అంచనా వేయగలదు.

గత మోడల్ WeatherNext 2తో పోలిస్తే వర్షపాత అంచనాల్లో 60 శాతం మెరుగుదల సాధించినట్లు గూగుల్ తెలిపింది.

అంతేకాదు.. సాధారణంగా ఆరు గంటల వ్యవధిలో ఇచ్చే అంచనాలకు బదులుగా ఇప్పుడు ప్రతి గంటకు వాతావరణ అంచనాలను అందించగలదు.

ADVERTISEMENT

వివరాలు

మెరుగైన అంచనాల కోసం ప్రత్యేక మార్పులు..

WeatherNext 3లో వచ్చిన మెరుగుదలలకు దాని డిజైన్‌లో చేసిన కీలక మార్పులు కారణమని గూగుల్ తెలిపింది.

గత మోడల్‌తో పోలిస్తే కొత్త మోడల్‌లో 2.4 రెట్లు ఎక్కువ పారామీటర్లు ఉన్నాయి.

మరింత ఉపయోగకరమైన సమాధానాలు, అంచనాలు అందించేలా దీనిని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.

అలాగే డీప్‌మైండ్ పరిశోధకులు తుపానులు, సైక్లోన్ల పయనాన్ని కూడా స్పష్టంగా చూపించేలా మోడల్‌లో మార్పులు చేశారు.

నిర్దిష్ట వాతావరణ డేటా స్టేషన్లకు అనుగుణంగా అంచనాలు రూపొందించేలా కొత్త వ్యవస్థకు శిక్షణ ఇచ్చారు.

దీంతో మరింత సూక్ష్మ స్థాయిలో వాతావరణ అంచనాలు ఇవ్వడంతో పాటు, వాస్తవ వాతావరణ డేటాతో వాటిని పోల్చి అంచనాల కచ్చితత్వాన్ని పరిశీలించవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

రియల్‌టైమ్ శాటిలైట్ డేటాతో మరింత కచ్చితత్వం

WeatherNext 3 మరో కీలకమైన సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. ఇది వాతావరణ ఉపగ్రహాల నుంచి వచ్చే రియల్‌టైమ్ డేటాను ప్రతి గంటకోసారి స్వీకరించగలదు.

దీంతో మరింత తరచుగా వాతావరణ అంచనాలను రూపొందించడం సాధ్యమవుతుంది.

వాస్తవ ప్రపంచంలో నమోదయ్యే పరిశీలనలను నేరుగా ఏఐ మోడళ్లలోకి అందించడం ద్వారా వాతావరణ అంచనాలు మరింత కచ్చితంగా ఉండే అవకాశం ఉంది.

ఈ విషయంలో WeatherNext 3 కీలక ముందడుగుగా గూగుల్ పేర్కొంది.

అధిక రిజల్యూషన్‌తో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ అంచనాలు అందించేందుకు రా వాతావరణ పరిశీలనలను నేరుగా ఉపయోగిస్తున్న తొలి ఏఐ మోడల్ WeatherNext 3 అని గూగుల్ వెల్లడించింది.

ADVERTISEMENT