Gemini 4 Neon: మూడు రెట్లు వేగం.. 60శాతం తక్కువ ధరతో గూగుల్ జెమినీ 4 నియాన్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో టెక్ దిగ్గజం గూగుల్ మరో కీలక ముందడుగు వేసింది. తక్కువ ఖర్చుతో, అత్యంత వేగంగా పనిచేసే సరికొత్త ఏఐ మోడల్ 'జెమినీ 4 నియాన్' (Gemini 4 Neon)ను గురువారం విడుదల చేసింది. ప్రస్తుతం గూగుల్ అందిస్తున్న అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడల్ 'జెమినీ 4 కార్బన్'కు సమానమైన పనితీరును లేదా అంతకంటే మెరుగైన ఫలితాలను నియాన్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కార్బన్ మోడల్‌తో పోలిస్తే మూడు రెట్లు వేగంగా పనిచేస్తుందని, ధర కూడా 60 శాతం తక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలపర్లు, పరిశోధకులు, వ్యాపార సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల కోసం ఏఐ టూల్స్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.
వివరాలు
జెమినీ 4 నియాన్‌తో గూగుల్ కొత్త ప్రయత్నం
అయితే అత్యాధునిక ఏఐ మోడళ్లను వినియోగించుకోవాలంటే అధిక ఖర్చు అవుతుండటం, ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పడుతుండటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.
ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపేలా వేగం, తక్కువ ధర, మెరుగైన ఆలోచనా సామర్థ్యాలను కలిపి గూగుల్ జెమినీ 4 నియాన్‌ను రూపొందించింది.
ముఖ్యంగా సంక్లిష్టమైన కోడింగ్, పరిశోధన, నాలెడ్జ్ వర్క్ వంటి పనులను తక్కువ సమయంలో పూర్తి చేయగలదని కంపెనీ పేర్కొంది.
ఈ కొత్త మోడల్‌ను పరిచయం చేస్తూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నవంబర్ 18న ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా వివరాలు వెల్లడించారు.
వివరాలు
సుందర్ పిచాయ్ ఏమన్నారంటే..
"సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, నాలెడ్జ్ వర్క్, సైన్స్‌కు సంబంధించిన పనులను వేగంగా, సమర్థంగా పూర్తి చేసే అత్యాధునిక మేధస్సుతో జెమినీ 4 నియాన్‌ను తీసుకొచ్చాం. గూగుల్ ఏఐ స్టూడియోలోని జెమినీ ఏపీఐ, జెమినీ ఫర్ బిజినెస్, గూగుల్ యాంటీగ్రావిటీతో పాటు జెమినీ యాప్‌లోని పెయిడ్ గూగుల్ ఏఐ ప్రో, అల్ట్రా సబ్స్క్రైబర్లకు నేటి నుంచే ఈ మోడల్ అందుబాటులోకి వస్తోంది" అని ఆయన వెల్లడించారు.
వివరాలు
ఆర్గాన్ స్థానంలో నియాన్.. జెమినీ మోడళ్లలో కీలక మార్పులు
జెమినీ 4 నియాన్ విడుదలతో గూగుల్ తన ఏఐ మోడళ్ల విభాగంలో పలు మార్పులు చేసింది.
ఇప్పటివరకు జెమినీ యాప్‌లో అందుబాటులో ఉన్న 'ఆర్గాన్' (Argon) మోడల్ స్థానంలో కొత్తగా నియాన్‌ను తీసుకొచ్చింది.
గూగుల్ ఏఐ మోడళ్ల జాబితాలో హైడ్రోజన్, కార్బన్ మోడళ్ల మధ్య నియాన్ కీలక స్థానాన్ని ఆక్రమించనుంది.
అప్డేట్ చేసిన జెమినీ యాప్‌లోని మోడల్ పికర్లో ప్రస్తుతం నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
ఆర్గాన్ స్థానంలో నియాన్.. జెమినీ మోడళ్లలో కీలక మార్పులు
ఆటో (Auto): వినియోగదారులు అడిగే ప్రశ్న లేదా అప్పగించే పని స్వభావాన్ని బట్టి ఏ మోడల్ అవసరమో ఆటోమేటిక్‌గా ఎంపిక చేస్తుంది.
జెమినీ 4 హైడ్రోజన్ (Gemini 4 Hydrogen): రోజువారీ సాధారణ పనులు, తక్కువ సమయంలో సమాధానాలు పొందడం వంటి అవసరాల కోసం దీన్ని రూపొందించారు.
జెమినీ 4 నియాన్ (Gemini 4 Neon): లోతైన విశ్లేషణ, క్లిష్టమైన సమస్యలను అర్థం చేసుకోవడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పనులను సమర్థంగా నిర్వహిస్తుంది.
జెమినీ 4 కార్బన్ (Gemini 4 Carbon): అత్యంత క్లిష్టమైన కోడింగ్, భారీ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు, సవాలుతో కూడిన పనుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.
వివరాలు
ఒకేసారి భారీ సమాచార విశ్లేషణ.. నాలుగు ఆలోచనా స్థాయులు
మరోవైపు, చెల్లింపు చందాదారుల కోసం ఆటో ఆప్షన్లో 'ఫ్లాష్-లైట్ 3.5' (Flash-Lite 3.5) అనే కొత్త వెర్షన్‌ను కూడా గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
అదే సమయంలో పాత మోడల్ అయిన 'జెమినీ 3.1 ప్రో'ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఏఐ మోడల్ ఒకేసారి ఎంత సమాచారాన్ని గుర్తుంచుకుని, దాన్ని విశ్లేషించగలదో తెలిపే సామర్థ్యాన్ని 'కాంటెక్స్ట్ విండో' అంటారు.
జెమినీ 4 నియాన్‌లో ఏకంగా 10 లక్షల (1 మిలియన్) టోకెన్ల కాంటెక్స్ట్ విండోను ఏర్పాటు చేశారు. దీని వల్ల వందల పేజీల పుస్తకాలు, పెద్ద మొత్తంలో డేటాను ఒకేసారి ఏఐకి అందించి ప్రశ్నలు అడగవచ్చు.
వివరాలు
ఒకేసారి భారీ సమాచార విశ్లేషణ.. నాలుగు ఆలోచనా స్థాయులు
స్ప్రెడ్షీట్లు, పీడీఎఫ్ డాక్యుమెంట్లు, చిత్రాలు, చార్టులు, ఆడియో, వీడియో ఫైళ్లను ఒకేసారి పరిశీలించి వాటిలోని ముఖ్యమైన సమాచారాన్ని గుర్తించగలదు.
పెద్ద మొత్తంలో సమాచారాన్ని విశ్లేషించాల్సిన పరిశోధకులు, సాఫ్ట్వేర్ నిపుణులు, వ్యాపార సంస్థలకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
దీనికి అదనంగా పని స్వభావం, క్లిష్టతను బట్టి ఏఐ ఎంత లోతుగా ఆలోచించాలనేది నిర్ణయించుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు.
ఇందుకోసం నాలుగు రకాల థింకింగ్ స్థాయులను అందుబాటులో ఉంచారు.
అవి లో (Low), మీడియం (Medium),హై (High),ఎక్స్ట్రా హై (Extra High). అవసరాన్ని బట్టి వీటిలో ఏదైనా ఒక స్థాయిని ఎంచుకోవచ్చు.
ప్రాథమిక పరీక్షల్లో నాణ్యత పరంగా జెమినీ 4 నియాన్, కార్బన్ మోడల్‌తో సమానంగా లేదా అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించిందని గూగుల్ వెల్లడించింది.
వివరాలు
బెంచ్‌మార్క్ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు
ఏఐ మోడళ్ల పనితీరును అంచనా వేసే అంతర్జాతీయ బెంచ్‌మార్క్ పరీక్షల్లో జెమినీ 4 నియాన్ మంచి ఫలితాలు సాధించింది. పలు విభాగాల్లో అగ్రస్థానాలకు చేరుకుంది. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్: ఎక్స్ట్రా హై థింకింగ్ స్థాయిలో 61 స్కోరు సాధించి మూడో స్థానంలో నిలిచింది.
వాల్స్ ఇండెక్స్ (VALS Index): 70.9 శాతం స్కోరుతో రెండో ర్యాంకును దక్కించుకుంది.
ఏజెంట్ అరీనా ఇండెక్స్: 4,200కు పైగా వాస్తవ ఏజెంట్ సెషన్లలో 1,336 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
మొదటి ర్యాంకులు: లీగల్ రీసెర్చ్ బెంచ్, ట్యాక్స్ ఏజెంట్ బెంచ్, జాపియర్ ఆటోమేషన్ బెంచ్ విభాగాల్లో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది.
వివరాలు
ధర, అందుబాటు వివరాలు ఇవే..
కోడింగ్ సామర్థ్యం: ఆర్టిఫిషియల్ అనాలిసిస్ కోడింగ్ ఏజెంట్ ఇండెక్స్‌లో 58.6 శాతం, టెర్మినల్-బెంచ్ 4.1 పరీక్షలో 65.2 శాతం స్కోరు సాధించింది.
ఈ ఫలితాలు కోడింగ్, పరిశోధన, చట్టపరమైన విశ్లేషణ, ఆటోమేషన్ వంటి విభిన్న రంగాల్లో నియాన్ సామర్థ్యాన్ని సూచిస్తున్నాయని గూగుల్ పేర్కొంది.
డెవలపర్లు, వ్యాపార సంస్థలు సులభంగా వినియోగించుకునేలా జెమినీ 4 నియాన్ ధరలను గూగుల్ నిర్ణయించింది.
ప్రతి 10 లక్షల (1 మిలియన్) ఇన్పుట్ టోకెన్లకు 3 డాలర్లు, అదే పరిమాణంలోని అవుట్‌పుట్ టోకెన్లకు 15 డాలర్లు వసూలు చేయనుంది.
గతంలో ఉపయోగించిన సమాచారాన్ని మళ్లీ వినియోగించే సందర్భంలో క్యాష్డ్ ఇన్పుట్ టోకెన్లకు ప్రత్యేక రాయితీ కల్పించింది.
వివరాలు
ధర, అందుబాటు వివరాలు ఇవే..
సాధారణ ధరతో పోలిస్తే 95 శాతం తగ్గింపుతో ప్రతి 10 లక్షల క్యాష్డ్ టోకెన్లకు కేవలం 0.15 డాలర్లు మాత్రమే వసూలు చేయనుంది.
గూగుల్ ఏఐ ప్రో, గూగుల్ ఏఐ అల్ట్రా, గూగుల్ ప్లస్ సబ్స్క్రైబర్లు జెమినీ యాప్ ద్వారా ఈ కొత్త మోడల్‌ను ఉపయోగించుకోవచ్చు.
డెవలపర్లకు గూగుల్ ఏఐ స్టూడియోలోని జెమినీ ఏపీఐ ద్వారా, వ్యాపార సంస్థలకు జెమినీ ఫర్ బిజినెస్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
వివరాలు
ధర, అందుబాటు వివరాలు ఇవే..
ఇక సైబర్ భద్రతా రంగంలో పనిచేసే నిపుణుల కోసం కూడా గూగుల్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
రాబోయే రోజుల్లో 'ఫెయిర్విండ్ ప్రోగ్రామ్' (Fairwind Program) కింద 'జెమినీ 4 నియాన్ ఫర్ సైబర్' పేరుతో ప్రత్యేక వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
మొత్తంగా తక్కువ ఖర్చుతో అత్యాధునిక ఏఐ సామర్థ్యాలను అందించడమే లక్ష్యంగా గూగుల్ ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సుందర్ పిచాయ్ చేసిన ట్వీట్
Really neat part of Genie 4 is you can type new prompts while exploring a generated world, like dropping in characters or changing the scene + the native audio adapts in real time! Now available in Project Genie for eligible Google AI Ultra subscribers. pic.twitter.com/8Z0H7AIx3r
— Sundar Pichai (@sundarpichai) November 19, 2026