
Google Pixel 10: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ రేపు విడుదల.. లైవ్ ఎలా చూడాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్సెల్ 10 సిరీస్ ను రేపు జరిగే Made by Google ఈవెంట్‌లో ఆవిష్కరించబోతుంది. ఈ లాంచ్ ఈవెంట్ రేపు రాత్రి 10:30 గంటలకు (భారత కాలమానం) ప్రారంభమవుతుంది. యూట్యూబ్‌లోని Made by Google అధికారిక ఛానల్ ద్వారా దీన్ని ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. ఈ సారి గూగుల్ మొత్తం ఐదు మోడళ్లను విడుదల చేయనున్నట్టు సమాచారం. Pixel 10, Pixel 10 Pro, Pixel 10 Pro XL, Pixel 10 Pro Fold.
టెక్ అప్‌గ్రేడ్‌లు
బేస్ మోడల్‌కి పెద్ద కెమెరా అప్‌గ్రేడ్
ఈ కొత్త ఫోన్లు Tensor G5 చిప్ తో వస్తాయి. దీనితో పాటు గూగుల్ Gemini AI ఫీచర్లు కూడా పనిచేస్తాయి. ముఖ్యంగా Pixel 10 (బేస్ మోడల్) వెనుక భాగంలో 5x టెలిఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. గూగుల్ బేస్ మోడల్‌లో ఇంతవరకు ఆప్టికల్ జూమ్ అందించలేదు. ఈసారి మొదటిసారి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఛార్జింగ్ ఇన్నోవేషన్
ఇతర పరికరాలు కూడా లాంచ్ అయ్యే అవకాశం
కొత్త పిక్సెల్ 10 సిరీస్ Qi2 మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. ఇది యాపిల్ MagSafe లాగా ఉండి, గూగుల్ దీన్ని Pixelsnap అని పిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఈవెంట్‌లో Pixel Watch 4 కూడా ఆవిష్కరించబడనుంది. దీంట్లో పెద్ద బ్యాటరీ, పలచని బెజెల్స్ ఉంటాయని సమాచారం. అలాగే తక్కువ ధరలో లభించే Pixel Buds 2a కూడా రాబోతున్నాయి.
డిజైన్ మెరుగుదలలు
TSMC తయారు చేసిన Tensor G5 చిప్
కొత్త Tensor G5 చిప్ ను TSMC 3nm N3E ప్రాసెస్‌తో తయారు చేసింది. ఇదే టెక్నాలజీతో ఆపిల్ A18 Pro చిప్ తయారైంది. ఈ మార్పుతో ప్రాసెసింగ్ పవర్ పెరగడమే కాకుండా, ఫోన్ వేడెక్కే సమస్య కూడా తగ్గనుందని నిపుణులు చెబుతున్నారు. ఇక Pixel 10 Pro Fold అయితే IP68 రేటింగ్ తో వచ్చే మొదటి ఫోల్డబుల్ ఫోన్‌గా నిలవనుంది. దీని వల్ల ఇది పూర్తిగా డస్ట్, పార్టికల్స్ నుంచి రక్షణ పొందుతుంది.
వెరైటీ రంగులు
రంగుల సంగతేంటి?
ఈసారి పిక్సెల్ 10 సిరీస్ విభిన్న రంగుల్లో లభ్యం కానుంది. బేస్ మోడల్ Pixel 10 - గూగుల్ సిగ్నేచర్ బ్లాక్ Obsidian తో పాటు Indigo, Frost, Limoncello అనే మూడు కొత్త షేడ్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇక Pro మోడల్స్ - Porcelain తెలుపు, Jade (లేత పచ్చ),Moonstone (గ్రే-నీలం) కలర్లలో లభ్యం అవుతాయి. మొత్తంగా చెప్పాలంటే, ఈసారి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌లో కెమెరా అప్‌గ్రేడ్, కొత్త చిప్, మాగ్నెటిక్ ఛార్జింగ్, ఫోల్డబుల్ ఫోన్, కొత్త రంగులు అన్నీ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.