గూగుల్ నుండి లాంచ్ అయిన పిక్సెల్ వాచ్ సిరీస్ 2 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ బుధవారం లాంచ్ చేసారు. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు పిక్సెల్ వాచ్ సిరీస్ 2 ని కూడా లాంచ్ చేసింది. పిక్సెల్ వాచ్ సిరీస్ 2 ఫీఛర్లు: క్వాల్ కామ్ 5100 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఆల్వేన్ ఆన్ డిస్ ప్లే సౌకర్యంతో కలిగి ఉంటుంది. మ్యాక్సిమమ్ బ్రైట్ నెస్ 1000నిట్స్ కలిగి ఉంటుంది. 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీని కలిగి ఉండి 306mAh బ్యాటరీ సామర్థ్యంతో వైర్ లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. బిల్డ్ ఇన్ మైన్, సైడ్ బటన్, జీపీఎస్, బ్లూటూత్ 5, ఎన్ఎఫ్సీ ఫీఛర్లు ఉన్నాయి.
పిక్సెల్ వాచ్ సిరీస్ 2 ధర, ఇతర విషయాలు
యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, బారో మీటర్, మ్యాగ్నెటో మీటర్, ఆల్టి మీటర్ వంటి సెన్సర్లు ఇందులో ఉన్నాయి. ఈసీజీ మానిటర్, అస్కిజన్ మానిటర్, స్కిన్ టెంపరేచర్, హార్ట్ రేట్ సెన్సర్ వంటి ఫీఛర్లు ఇందులో ఉన్నాయి. పాలిష్డ్ సిల్వర్, మ్యాట్ బ్లాక్, షాంపెయిన్ గోల్డ్ రంగుల్లో ఈ వాచ్ సిరీస్ అందుబాటులో ఉంది. అయితే ఈ వాచ్ బ్యాండ్లు మాత్రం వివిధ రకాల రంగుల్లో ఉన్నాయి. ఈ వాచ్ ధర 39,900రూపాయలుగా ఉంది. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో మొబైల్స్ కొనేవారు ఈ వాచ్ సిరీస్ ని కొనాలనుకుంటే 19,999రూపాయలకే దొరుకుతుంది. అక్టోబర్ 13వ తేదీ నుండి ఈ వాచ్ సిరీస్ ఫ్లిప్ కార్ట్ ఈ కామర్స్ సైటులో ఇది దొరుకుతుంది.