Google Quick Share Update: ఇక ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య ఫైల్ షేరింగ్ మరింత సులభం!
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ మరో కీలక ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ డివైస్‌లకు ఫైళ్లు పంపడం మరింత సులభం కానుంది. గూగుల్ తన Quick Share ఫీచర్‌కు AirDrop కంపాటిబిలిటీని విస్తరించింది. మొదట ఈ ఫీచర్ కేవలం Pixel 10 సిరీస్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు OnePlus, Oppo, Vivo, Samsung, Xiaomi, Honor బ్రాండ్ల ఎంపిక చేసిన డివైస్‌లకు కూడా ఈ సపోర్ట్ రానుంది. గూగుల్ I/O 2026 ఈవెంట్‌కు ముందు నిర్వహించిన ఆండ్రాయిడ్ షోలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
వివరాలు
Pixel 9a, Pixel 8 సిరీస్ డివైస్‌లకు ఈ సపోర్ట్ లేదు
ప్రస్తుతం Samsung Galaxy S26 సిరీస్, Google Pixel 10, Pixel 9 సిరీస్, Pixel 8a, Oppo Find X9 సిరీస్, Oppo Find N6, Vivo X300 Ultra ఫోన్లలో ఈ ఫీచర్ పనిచేస్తోంది. అయితే Pixel 9a, Pixel 8 సిరీస్ డివైస్‌లకు ఈ సపోర్ట్ లేదని గూగుల్ తెలిపింది. అలాగే త్వరలోనే Samsung Galaxy S25, S24 సిరీస్, Galaxy Z Fold 6, Z Fold 7, Z Flip 6, Z Flip 7, Oppo Find X8 సిరీస్, OnePlus 15, HONOR Magic V6, Magic8 Pro వంటి ఫోన్లకు కూడా Quick Share ద్వారా AirDrop సపోర్ట్ అందుబాటులోకి రానుంది.
వివరాలు
ఫీచర్ లేని ఫోన్ల కోసం గూగుల్ మరో ప్రత్యామ్నాయం
ఇక ఈ ఫీచర్ లేని ఫోన్ల కోసం గూగుల్ మరో ప్రత్యామ్నాయాన్ని కూడా తీసుకొచ్చింది. Quick Share ద్వారా QR కోడ్ జనరేట్ చేసి, దాన్నిiPhone లేదా Mac యూజర్లు స్కాన్ చేసి బ్రౌజర్ ద్వారా ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ ఫైల్ ట్రాన్స్‌ఫర్లు end-to-end encryptionతో సురక్షితంగా ఉంటాయని, ఫైళ్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ ఉపయోగించాలంటే iPhone లేదా Macలో AirDrop సెట్టింగ్స్‌లో "Everyone for 10 minutes" ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఆ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్ పంపాలనుకున్న ఫైల్‌ను ఓపెన్ చేసి Share → Quick Share సెలెక్ట్ చేసి సమీపంలోని ఆపిల్ డివైస్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.