Google: గూగుల్ NotebookLMకు భారీ అప్‌డేట్.. Gemini 3.5తో కొత్త ఫీచర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నోట్ టేకింగ్ యాప్ NotebookLMకు గూగుల్ భారీ అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ అప్‌డేట్‌లో గూగుల్ తన అధునాతన Gemini 3.5 AI మోడల్ను జోడించింది. దీని ద్వారా వినియోగదారులకు గతంతో పోలిస్తే మరింత ఖచ్చితమైన, నమ్మదగిన సమాచారాన్ని అందించనున్నట్లు తెలిపింది.
వివరాలు
గూగుల్ సెర్చ్'తో రీసెర్చ్ మరింత ఈజీ
తాజా అప్‌డేట్‌తో NotebookLM నేరుగా Google Searchను ఉపయోగించి ఒక అంశానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించగలదు. ఇంతకుముందులా PDFలు, నోట్స్ లేదా యూట్యూబ్ వీడియోలను విడిగా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులు తమకు కావాల్సిన అంశంపై ప్రశ్న అడిగితే చాలు.. సంబంధిత సమాచారాన్ని వెతికి అందించనుంది. దీంతో రీసెర్చ్ ప్రాజెక్టులు మరింత సులభంగా పూర్తి చేయవచ్చు.
వివరాలు
PDFలు, స్ప్రెడ్‌షీట్లు, ప్రజెంటేషన్లు కూడా..
NotebookLM తాజా వెర్షన్‌లో పలు కొత్త సామర్థ్యాలను జోడించింది. ఇప్పుడు వినియోగదారులు PDFలు, స్ప్రెడ్‌షీట్లు, చార్ట్‌లు, చిత్రాలు, ప్రజెంటేషన్లుతో పాటు ఇతర ఫైల్ ఫార్మాట్లను కూడా సృష్టించి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. దీనికోసం గూగుల్ తన Antigravity ఏజెంటిక్ కోడింగ్ ప్లాట్‌ఫామ్‌ను NotebookLMతో అనుసంధానం చేసింది. అలాగే యాప్‌లోని ప్రతి నోట్‌బుక్‌కు ప్రత్యేకమైన "సెక్యూర్ క్లౌడ్ కంప్యూటర్"ను అనుసంధానం చేయడం వల్ల పరిశోధన అవసరాలకు అనుగుణంగా కోడ్ రాయడం, అమలు చేయడం కూడా సాధ్యమవుతుంది.
వివరాలు
NotebookLM ప్రత్యేకత ఇదే
2023లో ప్రారంభమైన NotebookLM సాధారణ AI చాట్‌బాట్‌లకు భిన్నంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇంటర్నెట్‌లోని సాధారణ సమాధానాలను ఇవ్వడం కాకుండా,వినియోగదారులు అందించిన సోర్స్‌ల ఆధారంగా సమాధానాలను అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. వినియోగదారులు PDFలు, వెబ్‌సైట్లు, వీడియోలు, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. ఆ సమాచారాన్నే విశ్లేషించి సమాధానాలు ఇవ్వడం వల్ల ఇది విద్యార్థులు, పరిశోధకులు, సమాచార ఆధారిత రంగాల్లో పనిచేసే నిపుణులకు ఒక శక్తివంతమైన AI రీసెర్చ్ సహాయకుడిగా మారింది.