Google Search AI Mode: గూగుల్ సెర్చ్‌లో మీ వ్యక్తిగత సమాచారం కూడా ఇలా తెలుసుకోవచ్చు
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ సెర్చ్‌లోని ఏఐ మోడ్ ఇక సాధారణ ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చే స్థాయిలో ఉండదు. యూజర్లకు మరింత వ్యక్తిగతమైన సమాచారం అందించేందుకు 'పర్సనల్ ఇంటెలిజెన్స్'ను విస్తరిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇందులో భాగంగా గూగుల్ డ్రైవ్, గూగుల్ వాలెట్, జెమినీ యాప్‌లను ఏఐ మోడ్‌తో అనుసంధానం చేయనుంది. ఇప్పటికే జీమెయిల్, గూగుల్ క్యాలెండర్, గూగుల్ ఫొటోస్ వంటి సేవలను ఈ ఫీచర్ ఉపయోగిస్తోంది. అంటే యూజర్ డిజిటల్ జీవితానికి సంబంధించిన సందర్భాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా సమాధానం ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశం.
Details
డ్రైవ్‌లోని ఫైల్స్‌తో మరింత ఉపయోగకరమైన సమాధానాలు
గూగుల్ డ్రైవ్‌ను ఏఐ మోడ్‌తో కనెక్ట్ చేస్తే డాక్యుమెంట్లు, స్ప్రెడ్‌షీట్లు వంటి ఫైల్స్‌లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని సమాధానాలు ఇవ్వగలదు.
ఉదాహరణకు ట్యాక్స్ సీజన్ కోసం ప్లాన్ తయారు చేయాల్సి వస్తే.. డ్రైవ్‌లోని సంబంధిత సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యక్తిగత అవసరాలకు సరిపోయే ప్లాన్‌ను సూచించగలదు.
ఇక గూగుల్ వాలెట్‌ను కనెక్ట్ చేస్తే ఖర్చులను గమనించడం, ఆర్థిక లక్ష్యాలను ట్రాక్ చేయడం, క్రెడిట్ కార్డు రివార్డులను మెరుగ్గా ఉపయోగించుకోవడంలో ఏఐ సహాయం చేస్తుంది.
అయితే వాలెట్ ద్వారా డబ్బును బదిలీ చేయడం లేదా నిర్వహించడం మాత్రం ఏఐకి సాధ్యం కాదు.
Details
జెమినీతోనూ సమాచారం షేర్.. యూజర్ చేతిలోనే నియంత్రణ
జెమినీ యాప్‌లో ఒక అంశంపై వెతికిన తర్వాత అదే విషయాన్ని మళ్లీ ఏఐ మోడ్‌లో మొదటి నుంచి వివరించాల్సిన అవసరం లేకుండా గూగుల్ కొత్త మార్పు తీసుకొస్తోంది.
రెండు సేవల మధ్య సందర్భాన్ని షేర్ చేసుకోవడంతో సెర్చ్ మరింత సులభం కానుంది. అయితే డ్రైవ్, వాలెట్ వంటి వ్యక్తిగత సేవలను ఏఐతో కనెక్ట్ చేయడం తప్పనిసరి కాదు.
యూజర్లు ఎప్పుడైనా పర్సనల్ ఇంటెలిజెన్స్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. త్వరలో ఏఐ సమాధానం ఇచ్చేటప్పుడు ఉపయోగించిన వ్యక్తిగత సందర్భాన్ని 'Personalization' ఐకాన్ ద్వారా చూసే అవకాశం కూడా కల్పించనుంది.
ఇటీవలి సెర్చ్‌ల ఆధారంగా ఏఐ ఓవerviews, ఏఐ మోడ్‌లో మరింత సంబంధిత సమాధానాలు కూడా కనిపించనున్నాయి.