
2023లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఎవరినో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి సంవత్సరం Googleలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు, సినిమాలు, ట్రెండింగ్ అంశాలను సెర్చ్ ఇంజిన్ గూగుల్ విడుదల చేస్తుంది.
అందులో భాగంగానే 2023లో ఇండియాలో టాప్ ట్రెండింగ్ సెర్చ్‌లను గూగుల్ ప్రకటించింది. అందులో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకుందాం.
ఇండియాలో టాప్ ట్రెండింగ్ పర్సనాలిటీలు
1.కియారా అద్వానీ
2.శుభ్‌మన్ గిల్
3.రచిన్ రవీంద్ర
4.మహ్మద్ షమీ
5.ఎల్విష్ యాదవ్
6.సిద్ధార్థ్ మల్హోత్రా
7.గ్లెన్ మాక్స్‌వెల్
8.డేవిడ్ బెక్హాం
9.సూర్యకుమార్ యాదవ్
10.ట్రావిస్ హెడ్
ఈ ఏడాది కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి జరిగింది. దీంతో ఈ ఇద్దరు 2023లో ట్రెండింగ్‌లో ఉన్నారు. వరల్డ్‌కప్‌లో రాణించిన క్రికెటర్ల పేర్లు కూడా టాప్ ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
వరల్డ్
వరల్డ్‌లో 2023లో అత్యధికంగా శోధించిన నటీనటుల వీరే
ప్రపంచస్థాయిలో 2023లో ఎక్కువ మంది సెర్చే చేసిన జాబితాలో భారత్ నుంచి కియారా అద్వానీకి మాత్రమే చొటు దక్కింది. కియారా అద్వానీ 9వ స్థానంలో ఉన్నారు.
1 జెరెమీ రెన్నర్
2 జెన్నా ఒర్టెగా
3 ఇచికావా ఎన్నోసుకే IV
4 డానీ మాస్టర్సన్
5 పెడ్రో పాస్కల్
6 జామీ ఫాక్స్
7 బ్రెండన్ ఫ్రేజర్
8 రస్సెల్ బ్రాండ్
9 కియారా అద్వానీ
10 మాట్ రిఫ్
వరల్డ్
టాప్ 10 సినిమాల్లో భారత్ నుంచి మూడు చిత్రాలు
ఈ సంవత్సరంలో అత్యధికంగా శోధించబడిన గ్లోబల్ టాప్ 10 చిత్రాల్లో మూడు భారతీయ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.
ఈ ఏడాది షారూక్ ఖాన్ నుంచి పఠాన్, జవాన్ రెండు సినిమాలు రాగా.. అవి రెండు కూడా ఘన విజయం సాధించాయి. అందు ఆ రెండు టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
1) బార్బీ
2) ఓపెన్‌హైమర్
3) జవాన్
4) సౌండ్ ఆఫ్ ఫ్రీడం
5) జాన్ విక్: చాప్టర్ 4
6) అవతార్: ది వే ఆఫ్ వాటర్
7) ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
8) గదర్ 2
9) క్రీడ్ III
10) పఠాన్