LOADING...
Google: AI ఓవర్ వ్యూస్ మరింత స్మార్ట్.. సోషల్ మీడియా కోట్స్‌తో గూగుల్ అప్‌డేట్
AI ఓవర్ వ్యూస్ మరింత స్మార్ట్.. సోషల్ మీడియా కోట్స్‌తో గూగుల్ అప్‌డేట్

Google: AI ఓవర్ వ్యూస్ మరింత స్మార్ట్.. సోషల్ మీడియా కోట్స్‌తో గూగుల్ అప్‌డేట్

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
07:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్‌లో ఉన్న AI ఓవర్ వ్యూస్(AI Overviews) ఫీచర్‌కు కొత్త అప్‌డేట్స్‌ను ప్రకటించింది. బుధవారం వెల్లడించిన ఈ అప్‌డేట్స్‌లో మొత్తం ఐదు మార్పులు ఉన్నాయి. ఇవన్నీ యూజర్లకు మరింత స్పష్టమైన సమాచారం, సంబంధిత లింకులు అందించడానికే ఉద్దేశించినవి. అయితే వీటిలో ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులపై ఆధారపడిన కొత్త ఫీచర్ ప్రత్యేకంగా నిలిచింది.

వివరాలు 

నేరుగా కోట్‌ల రూపంలో..

ఇప్పటివరకు కొన్ని రిప్లైల్లో మాత్రమే సోషల్ మీడియా లింకులు చూపించిన AI ఓవర్ వ్యూస్, ఇకపై రెడ్డిట్(Reddit)వంటి ప్లాట్‌ఫామ్‌లలో నెటిజన్స్ పంచుకున్న అభిప్రాయాలు, వారి అనుభవాలను నేరుగా కోట్‌ల రూపంలో చూపించనుంది. వినియోగదారులు ఎక్కువగా ఇతరుల సలహాలు, అనుభవాలను వెతుకుతున్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకువచ్చినట్లు గూగుల్ తెలిపింది. దీంతో పబ్లిక్ డిస్కషన్స్‌, సోషల్ మీడియా, ఫస్ట్‌హ్యాండ్ అనుభవాల నుంచి ఉపయోగకరమైన సమాచారం సులభంగా అందుబాటులోకి రానుంది.

Advertisement