
Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఏదైనా సమాచారం వెంటనే తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్.
చాలా మంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి దాంతో సెర్చ్ చేయడం అలవాటైపోయింది.
అయితే ఈ క్రోమ్ బ్రౌజర్‌ను వాడే యూజర్లకు భారత ప్రభుత్వం ఒక కీలక హెచ్చరికను జారీ చేసింది.
డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నవారు వెంటనే ఓ ముఖ్యమైన చర్య తీసుకోవాలని సూచించింది.
ఈ హెచ్చరికను భారత ప్రభుత్వానికి చెందిన సీఈఆర్‌టీ-ఇన్(ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) విడుదల చేసింది.
ప్రముఖ వెబ్ బ్రౌజర్ అయిన క్రోమ్‌లో కొన్ని ప్రధాన లోపాలు ఉన్నట్లు వెల్లడించింది.
ఈలోపాలను ఉపయోగించి హ్యాకర్లు మీ ల్యాప్‌టాప్ నుంచి సున్నితమైన సమాచారాన్ని దోచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
వివరాలు
హ్యాకర్లు యూజర్ల కంప్యూటర్లను సులభంగా నియంత్రించగల అవకాశం
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో పాత వెర్షన్లలో కొన్ని బలహీనతలు ఉన్నట్లు గుర్తించినట్లు సీఈఆర్‌టీ-ఇన్ తెలియజేసింది.
ఈ లోపాల వల్ల హ్యాకర్లు యూజర్ల కంప్యూటర్లను సులభంగా నియంత్రించగల అవకాశముంది.
మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నట్లయితే, 136.0.7103.114 కన్నా తక్కువ వెర్షన్లలో ఈ లోపాలు ఉంటాయని తెలిపింది.
అదే విధంగా, మాక్ లేదా లినక్స్ యూజర్లు అయితే, 136.0.7103.113కి ముందు వెర్షన్లలో ఈ సమస్యలు ఉన్నట్లు పేర్కొంది.
మొత్తం మీద పాత వెర్షన్ల క్రోమ్ బ్రౌజర్‌లో రెండు ప్రధాన బగ్‌లు ఉన్నాయని వెల్లడించింది.
వివరాలు
క్రోమ్ బ్రౌజర్‌లో రెండు ప్రధాన బగ్‌లు
CVE-2025-4664: ఈ లోపం కారణంగా క్రోమ్ బ్రౌజర్‌లో ఉండే లోడర్ ఫంక్షన్ సరిగా పనిచేయదు. దీన్ని ఉపయోగించి హ్యాకర్లు స్పెషల్‌గా తయారుచేసిన వెబ్‌సైట్ ద్వారా యూజర్ కంప్యూటర్ నుంచి వ్యక్తిగత డేటాను దొంగిలించగలరు.
CVE-2025-4609: ఈ బగ్ క్రోమ్‌లోని మోజో కాంపోనెంట్‌ను ప్రభావితం చేస్తుంది. ఇది డేటా హ్యాండ్లింగ్ ప్రక్రియలో సమస్యను సృష్టించి, హ్యాకర్లకు సిస్టమ్‌లోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తుంది.
వివరాలు
ఈ బగ్‌ల నుంచి ఎలా రక్షించుకోవాలి?
ఈ సెక్యూరిటీ లోపాల వల్ల అపాయం ఎదిరించకుండా ఉండేందుకు, యూజర్లు తమ క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సీఈఆర్‌టీ-ఇన్ సూచించింది.
అప్‌డేట్ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. మొదటగా మీ కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి.
తర్వాత పై కుడి మూలలో కనిపించే మూడు చుక్కల మెనూ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
అప్పుడు "Help" అనే ఎంపికలో "About Google Chrome" పై క్లిక్ చేయాలి. అక్కడికి వెళ్లగానే క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిక్‌గా లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అవుతుంది.