మీ ఫోన్ లో ఎమర్జెనీ అలెర్ట్స్ ని టెస్ట్ చేస్తున్న ప్రభుత్వం, వివరాలివే
కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు పెద్ద బీప్ శబ్దంతో ఒక మెసేజ్ ని తమ ఫోన్లో కనుగొన్నారు. ఆ మెసేజ్, ఆ శబ్దం ఏంటని చాలామంది ఆశ్చర్యపోయారు. ఫోన్ లో ఎమర్జెన్సీ అలెర్ట్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రభుత్వం టెస్ట్ చేస్తుంది. అందుకే అలాంటి మెసేజ్ వస్తోంది. ఇండియాలో జూన్ 20వ తేదీన ఇలాంటి మెసేజ్ చాలామందికి వచ్చింది. ఆ మెసేజ్ చూసి దానికింద ఓకే బటన్ ని మీరు క్లిక్ చేసేవరకు ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఓకే అనగానే సౌండ్ ఆగిపోతుంది. దానర్థం మీరు ఆ మెసేజ్ ని పూర్తిగా చదివారన్నమాట.
ఇంతకీ ఆ మెసేజ్ లో ఏముంటుంది?
ఇలా పెద్ద సౌండ్ తో వచ్చే సందేశంలో, ఇది డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ కు చెందిన సెల్ బ్రాడ్ క్యాస్టింగ్ సిస్టమ్ నుండి వచ్చిన మెసేజ్ అనీ, దీన్ని మీరు పట్టించుకోవాల్సిన పనిలేదనీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ అమల్లోకి తీసుకొచ్చిన ఎమర్జెన్సీ అలెర్ట్ టెస్టింగ్ అనీ ఉంటుంది. ఇంకా విపత్తుల సమయంలో భద్రతను పెంచి తక్షణ సమయంలో సాయం అందించే ఉద్దేశ్యంతో ఇలా మెసేజ్ పంపిస్తున్నారని అందులో ఉంటుంది. ఆగస్టు 17వ తేదీన కూడా ఆండ్రాయిడ్ యూజర్లకు ఇలాంటి మెసేజ్ వచ్చింది. భారత ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి సునామీ, భూకంపాలు, వరదలకు సంబంధించిన అలెర్ట్స్ ఇవ్వడానికి పనిచేస్తుంది.