GTA 6 Auto-Drive: జిటిఏ 6 ఆటో డ్రైవ్‌తో కార్లు, బోట్లు ప్రయాణం...అద్భుతమైన అనుభూతి
ఈ వార్తాకథనం ఏంటి
జిటిఏ 6 లో ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు పదే పదే స్టీరింగ్, బ్రేక్, యాక్సిలరేటర్ చూసుకోవాల్సిన పని లేకుండా చేసే ఫీచర్ Auto-Drive. మ్యాప్‌లో ముందుగా Waypoint పెట్టి, Cinematic Modeను ఆన్ చేస్తే Jason లేదా Lucia వాహనాన్ని ఆ గమ్యస్థానం వైపు నడుపుతారు. ఈ సమయంలో ప్లేయర్ గేమ్‌లోని రోడ్లు, నగర దృశ్యాలను సినిమాలా చూస్తూ ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు. ముఖ్యంగా Vice City నుంచి Leonidaలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే సుదీర్ఘ ప్రయాణాల్లో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
Details
Auto-Drive ఎలా ఆన్ చేయాలి?
ముందుగా కారులోకి ఎక్కి మ్యాప్ ఓపెన్ చేసి వెళ్లాల్సిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి.
అక్కడ Waypoint పెట్టిన తర్వాత డ్రైవింగ్ ప్రారంభించి D-padలో Down బటన్‌ను ఉపయోగించాలి. అనంతరం PlayStationలో Options లేదా Xboxలో Menu ద్వారా Cinematic Modeలోకి వెళ్లాలి.
Auto-Drive ఆప్షన్ కనిపించినప్పుడు PlayStationలో Circle, Xboxలో B బటన్‌ను నొక్కి పట్టుకుంటే ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.
ఆ తర్వాత వాహనాన్ని AI నియంత్రిస్తుంది. అవసరమైతే L2, R2 లేదా LT, RT బటన్లతో వేగాన్ని కూడా మార్చుకోవచ్చు.
Details
కార్లకే కాదు.. బోట్లలోనూ Auto-Drive
GTA 6లో Auto-Drive ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం కార్లకు మాత్రమే పరిమితం కాదు.
Leonidaలోని నీటి మార్గాల్లో బోట్లతో ప్రయాణించేటప్పుడు కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించొచ్చు.
బోటులోకి ఎక్కి నీటి మార్గంలో చేరగలిగే గమ్యస్థానాన్ని Waypointగా పెట్టి Cinematic Mode ద్వారా Auto-Drive ఆన్ చేస్తే బోటు అదే దిశగా వెళ్తుంది.
అయితే గమ్యస్థానం భూమిపై ఉంటే, బోటు వెళ్లగలిగే నీటి మార్గం ముగిసిన దగ్గరే ప్రయాణం ఆగిపోతుంది.
Details
పోలీస్ ఛేజ్‌లో మాత్రం జాగ్రత్త!
Auto-Drive ఉన్నంత మాత్రాన వాహనం అన్ని పరిస్థితుల్లోనూ పర్ఫెక్ట్‌గా నడుస్తుందని అనుకోవద్దు.
ట్రాఫిక్, ప్రమాదాలు, ఇతర వాహనాలు, క్లిష్టమైన మార్గాల వల్ల AIకి ఇబ్బందులు రావచ్చు.
పోలీసుల వెంటపడే పరిస్థితుల్లో లేదా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఇది అంతగా ఉపయోగపడదు.
Settingsలో Gameplay విభాగం ద్వారా Auto-Driveను 'Unrestricted'గా మార్చుకోవచ్చు.
అయినా కూడా ఇది Fast Travel కాదు. వాహనం నిజంగానే మొత్తం దూరం ప్రయాణించాల్సిందే.
అందుకే ప్రశాంతంగా Leonidaను చుట్టేయాలనుకునే వారికి Auto-Drive మంచి సౌకర్యంగా చెప్పొచ్చు.