Loading...
GTA 6 India: 13 ఏళ్ల తరువాత వస్తున్న జిటిఏ 6...ఫీచర్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే
13 ఏళ్ల తరువాత వస్తున్న జిటిఏ 6...ఫీచర్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే

GTA 6 India: 13 ఏళ్ల తరువాత వస్తున్న జిటిఏ 6...ఫీచర్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 19, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

వీడియో గేమ్ ప్రియులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. 2013లో GTA 5 విడుదలైన తర్వాత దాదాపు 13 ఏళ్లకు గ్రాండ్ తెఫ్ట్ ఆటో సిరీస్‌లో తదుపరి భారీ గేమ్ జిటిఏ 6 అందుబాటులోకి వస్తోంది. నవంబర్ 19 అర్ధరాత్రి 12 గంటల నుంచి భారత్‌లో ఈ గేమ్ ఆడేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ప్లేస్టేషన్ 5, Xbox Series X, Series S కన్సోళ్లలో మాత్రమే గేమ్ అందుబాటులోకి రానుంది. ఇంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వస్తున్న గేమ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ అభిమానుల చూపంతా దీనిపైనే ఉంది.

Details

GTA 6 ధర ఎంతంటే?

GTA 6 స్టాండర్డ్ ఎడిషన్ ధరను భారత్‌లో రూ.5,999గా నిర్ణయించారు. మరిన్ని ప్రత్యేక ఫీచర్లు, అదనపు వాహనాలు, ఆయుధాలు వంటి ప్రయోజనాలు ఉండే అల్టిమేట్ ఎడిషన్ ధర రూ.7,499గా ఉంది.

అంటే గేమ్ కొనాలనుకునే వారికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అసలు ఆశ్చర్యం ధరలో కంటే గేమ్ పరిమాణంలోనే ఉంది.

GTA 6ను కన్సోల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి సుమారు 212 జీబీ స్టోరేజ్ అవసరం. ఇంత భారీ సైజ్ చూస్తే గేమ్‌లో ఉండే గ్రాఫిక్స్, ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

Details

వైస్ సిటీకి మరోసారి ప్రయాణం

GTA 6 కథ ఫ్లోరిడా స్ఫూర్తితో రూపొందించిన కల్పిత లియోనిడా ప్రాంతంలో సాగుతుంది.

ఇందులో వైస్ సిటీ కూడా కీలక నేపథ్యంగా కనిపించనుంది. జేసన్, లూసియా అనే ఇద్దరు ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది.

ఈ ఇద్దరి ప్రయాణం, నేర ప్రపంచం, యాక్షన్, డ్రైవింగ్, ఓపెన్ వరల్డ్ అనుభవం కలగలిపి గేమ్‌ను రూపొందించారు.

ఇప్పటికే గేమింగ్ అభిమానులను ఆకట్టుకున్న ఈ పాత్రలు, కొత్త గేమ్‌లో ఎలా ముందుకు వెళ్తాయన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ADVERTISEMENT

Details

212 జీబీ స్టోరేజ్.. పీసీ వెర్షన్ ఎప్పుడు?

గేమ్ భారీగా ఉండటంతో కన్సోల్‌లో తగినంత స్టోరేజ్ ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

వినియోగదారుల కోసం రాక్‌స్టార్ గేమ్స్ ప్రీ-లోడింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే PC గేమర్లకు మాత్రం ఇంకా నిరీక్షణ తప్పడం లేదు.

PC వెర్షన్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై రాక్‌స్టార్ గేమ్స్ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.

GTA 5 తర్వాత వచ్చిన ప్రధాన సిరీస్ గేమ్ కావడంతో GTA 6పై ఏర్పడిన అంచనాలు సాధారణ గేమ్‌ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.

ADVERTISEMENT