Guillain Barre Syndrome: పూణేని వణికిస్తున్న కొత్త వ్యాధి.. గులియన్ బారే సిండ్రోమ్.. 59 కేసులు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని పూణేలో అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
ప్రస్తుతం 59 మంది గులియన్ బారే సిండ్రోమ్ (GBS) బాధితులు ఉన్నారు.
ఈ వ్యాధి వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది.
డాక్టర్లు ఈ 59 మందికి గులియన్ బారే సిండ్రోమ్‌ని నిర్ధారించారు, అందులో 12 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు.
నగరంలో ఈ వ్యాధి అకస్మాత్తుగా పెరిగిపోవడంతో, మహారాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక పరిశోధనా టీమ్‌ను ఏర్పాటుచేసింది.
వివరాలు
గులియన్ బారే సిండ్రోమ్ పక్షవాతానికి (paralysis) దారితీస్తుంది..
జనవరి 22 నాటికి 59 కేసుల్లో 38 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు.
12 మంది పేషెంట్లు తీవ్రమైన పరిస్థితుల్లో వెంటిలేటర్లపై ఉన్నారు. బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు GBSకి కారణమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు, ఇవి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి.
ఈ సిండ్రోమ్ చిన్న పిల్లలు, యువకుల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. ముందుగానే గులియన్-బారే సిండ్రోమ్‌ను గుర్తించి చికిత్స అందించడంతో, పేషెంట్లు పూర్తిగా కోలుకుంటారు.
గులియన్ బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి,ఇందులో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది.
ఈ సిండ్రోమ్ బలహీనత,తిమ్మిరి లేదా పక్షవాతానికి దారితీస్తుంది.ఈ వ్యాధి కారణాలు స్పష్టంగా తెలియవు, కానీ ఇది దెబ్బతినిన నరాలు ద్వారా శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది.
వివరాలు
మెట్లు ఎక్కడం,నడవడం కష్టం
బలహీనత, ఫస్ట్ పాదాలు, తర్వాత శరీరాన్ని కాళ్లు, చేతులు, ముఖం, శ్వాస కండరాలు వీక్ అవుతాయి.
వ్యాధి తీవ్రత పెరిగితే, మెట్లు ఎక్కడం,నడవడం కష్టంగా అనిపిస్తుంది. నరాలు దెబ్బతినిపోవడం వల్ల మెదడులో అసాధారణ సంకేతాలు వస్తాయి.
ఈ సిండ్రోమ్ ఇతర లక్షణాలలో దృష్టిలో ఇబ్బంది, మ్రింగడం, మాట్లాడడం లేదా నమలడం లో కష్టం, చేతులు, కాళ్ళలో నొప్పి, రాత్రిపూట నొప్పి మొదలైనవి ఉన్నాయి.
ఇంకా అసాధారణ హాట్‌బీట్, రక్తపోటు మార్పులు, జీర్ణక్రియ సమస్యలు, మూత్రాశయ నియంత్రణలో సమస్యలు కూడా ఉంటాయి.