Space: స్పేస్‌లో కనిపించిన హార్ట్ షేప్ సరస్సు.. వ్యోమగామి పోస్టు సోషల్ మీడియాలో వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షం నుంచి భూమిని వీక్షిస్తున్న సమయంలో గుండె (హార్ట్) ఆకారంలో కనిపించిన ఓ సరస్సు ఫొటోను ప్రముఖ వ్యోమగామి 'సోఫీ అడెనోట్ (Sophie Adenot) సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో పంచుకున్నారు. ఆ అరుదైన దృశ్యంతో పాటు ఆమె చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తన పోస్టులో సోఫీ అడెనోట్ మాట్లాడుతూ.. ప్రకృతిలో గుండె ఆకారాలు కనిపించినప్పుడల్లా నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అది కేవలం మన మెదడు సృష్టించే 'పరైడోలియా' (Pareidolia) అనే దృశ్య భ్రమ మాత్రమే అని నాకు తెలుసు. అయినప్పటికీ నా మనసుకు మాత్రం భూమి నాకు ప్రేమతో ఓ సందేశం పంపుతున్నట్లుగా అనిపిస్తుందని పేర్కొన్నారు.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టు
అలాగే ప్రస్తుతం వేసవి కాలం గతంలోలా నిశ్చింతగా అనిపించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ అంతరిక్షం నుంచి కనిపించిన ఈ హార్ట్ ఆకార సరస్సు ప్రపంచంలో ఇప్పటికీ ప్రేమించడానికి, సంరక్షించడానికి, కాపాడేందుకు ఎంతో విలువైన ప్రకృతి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోందని చెప్పారు.
ఈ సరస్సును ఆమె ఆశ, ప్రేమ, ప్రకృతిపట్ల బాధ్యతకు ప్రతీకగా అభివర్ణించారు. సోఫీ అడెనోట్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆమె పంచుకున్న ఫొటోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి నిజంగా అద్భుతమైనది, భూమి అందాలను అంతరిక్షం నుంచి చూడటం అదృష్టం అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సోఫీ భావోద్వేగ సందేశాన్ని కూడా అనేక మంది ప్రశంసిస్తున్నారు.