LOADING...
'Robot Phone': డ్యాన్స్ చేసే స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. హానర్ ఫ్యూచర్ టెక్నాలజీ విడుదల
డ్యాన్స్ చేసే స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. హానర్ ఫ్యూచర్ టెక్నాలజీ విడుదల

'Robot Phone': డ్యాన్స్ చేసే స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. హానర్ ఫ్యూచర్ టెక్నాలజీ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికేలా ప్రముఖ టెక్ సంస్థ Honor సరికొత్త 'రోబోట్ ఫోన్'ను ఆవిష్కరించింది. Mobile World Congress 2026 (MWC 2026) వేదికగా ఈ ఫ్యూచరిస్టిక్ డివైస్‌ను కంపెనీ ప్రదర్శించింది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా గింబల్ స్టెబిలైజ్డ్ కెమెరా ఆర్మ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా సెన్సార్‌ను అమర్చారు. ఇండస్ట్రీలోనే అతి చిన్న 4DoF గింబల్ సిస్టమ్‌తో రూపొందించిన ఈ ఫోన్, AI ఆధారిత కెమెరా ట్రాకింగ్ మోడ్‌లతో పాటు రోబోటిక్ ఫీచర్లను కూడా అందిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు తల ఊపడం,కాదు అనేటప్పుడు తల అడ్డంగా కదపడం, సంగీతం వస్తే డ్యాన్స్ చేయడం వంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వివరాలు 

హ్యూమనాయిడ్ రోబోట్

MWC వేదికపై ఈ ఫోన్ AI ఆధారిత సంభాషణ చేస్తూ, తన కెమెరా ఆర్మ్‌ను కదిలిస్తూ డెమో ఇచ్చింది. అయితే మిగతా ఫీచర్లపై కంపెనీ ఇప్పటివరకు పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో చైనా మార్కెట్‌లో ముందుగా ఈ 'రోబోట్ ఫోన్'ను విడుదల చేయనున్నట్లు Honor సంస్థ ప్రకటించింది. ఇదే ఈవెంట్‌లో హ్యూమనాయిడ్ రోబోట్‌ను కూడా కంపెనీ టీజ్ చేసినప్పటికీ, ఆ డివైస్‌కు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు.

Advertisement