Loading...
Houthis: హూతీల క్షిపణి ప్రాజెక్టులకు క్లాడ్‌ ఏఐ సాయం.. ఆంత్రోపిక్‌ నివేదికలో సంచలన విషయాలు
ఆంత్రోపిక్‌ నివేదికలో సంచలన విషయాలు

Houthis: హూతీల క్షిపణి ప్రాజెక్టులకు క్లాడ్‌ ఏఐ సాయం.. ఆంత్రోపిక్‌ నివేదికలో సంచలన విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ.. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌ (Anthropic) తాజాగా వెల్లడించిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న యెమెన్‌కు చెందిన హౌతీలు (Houthis).. క్షిపణుల అభివృద్ధి కోసం తమ ఏఐ చాట్‌బాట్‌ క్లాడ్‌ను ఉపయోగించినట్లు గుర్తించామని సంస్థ తెలిపింది. ఆంత్రోపిక్‌ వివరాల ప్రకారం.. యెమెన్‌కు చెందిన ఓ బృందం క్షిపణుల మార్గనిర్దేశం (Guidance), నావిగేషన్‌, నియంత్రణ (Control) వ్యవస్థలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు క్లాడ్‌ సాయం తీసుకునే ప్రయత్నం చేసింది.

వివరాలు 

మరో ఆరు సంస్థలు.. 

ఈ సాంకేతికతను ఉపయోగించి 2,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించగల బాలిస్టిక్‌ క్షిపణులతోపాటు.. హైపర్‌సోనిక్‌ గ్లైడ్‌ వెహికల్‌ కలిగిన క్షిపణి వేరియంట్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని సంస్థ పేర్కొంది.

అయితే, ఈ క్షిపణులను శత్రువులపై ప్రయోగించారా? లేదా? అనే విషయంపై నిర్ధారించడానికి తమ వద్ద తగిన ఆధారాలు లేవని ఆంథ్రోపిక్‌ స్పష్టం చేసింది.

తుపాకులు, క్షిపణులు, సాయుధ డ్రోన్లు, బాంబులు తదితర ఆయుధాలతోపాటు.. వాటి నియంత్రణ వ్యవస్థలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి మరో ఆరు సంస్థలు కూడా క్లాడ్‌ను వినియోగించేందుకు ప్రయత్నించినట్లు ఆంథ్రోపిక్‌ వెల్లడించింది.

ఈ జాబితాలో రష్యాతో సంబంధాలున్న ఓ సైబర్‌ గూఢచర్య సంస్థతోపాటు.. చైనాకు చెందిన పలు ఏఐ సంస్థలు కూడా ఉన్నట్లు తెలిపింది.

వివరాలు 

జీవాయుధాల తయారీకి ఏఐ వినియోగంపై నిషేధం

జీవాయుధాల (Biological Weapons) అభివృద్ధి కోసం కొందరు తమ ఏఐ మోడల్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించామని ఆంథ్రోపిక్‌ పేర్కొంది.

ఈ నేపథ్యంలో జీవాయుధాల తయారీ, అభివృద్ధి వంటి కార్యకలాపాలకు తమ ఏఐ సాంకేతికతను వినియోగించకుండా నిషేధం విధించినట్లు తెలిపింది.

ఈ ప్రయోజనాల కోసం తమ ఏఐని ఉపయోగించేందుకు ప్రయత్నించిన శాస్త్రవేత్తలను కూడా బ్లాక్‌ చేసినట్లు వెల్లడించింది.

గత ఎనిమిది నెలల్లో గుర్తించిన అక్రమ కార్యకలాపాల్లో నకిలీ డేటింగ్‌ యాప్‌లు, హోటల్‌ వైఫై మోసాలు, రహస్య నిఘా వంటి అంశాలు ఉన్నాయని సంస్థ తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

జీవాయుధాల తయారీకి ఏఐ వినియోగంపై నిషేధం

ప్రభుత్వ మద్దతు ఉన్న బృందాలు, నేరగాళ్లు, స్పైవేర్‌ విక్రేతలు, ప్రభుత్వ ప్రచార సంస్థలు, రాజకీయ ఉద్దేశాలతో పనిచేసే వ్యక్తులు తమ సాంకేతికతను దుర్వినియోగం చేసిన ఘటనలను నివేదికలో ప్రస్తావించింది.

తమ సేవలు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆంథ్రోపిక్‌ పేర్కొంది.

అందులో భాగంగానే ఈ నివేదికను బహిర్గతం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ADVERTISEMENT