Page Loader
Truecaller on Android: ట్రూకాలర్​లో మీ పేరును సరిచేసుకోవడం ఎలా అంటే..?
ట్రూకాలర్​లో మీ పేరును సరిచేసుకోవడం ఎలా అంటే..?

Truecaller on Android: ట్రూకాలర్​లో మీ పేరును సరిచేసుకోవడం ఎలా అంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2024
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కాలర్ ఐడీ యాప్‌ ట్రూ కాలర్. దీనిని ఎందరో విశ్వసిస్తారు. మన కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులు కాల్ చేసినప్పుడు, వారి వివరాలను తెలుపుతుంది. ఫోన్ రింగ్ అయ్యే ముందు ఎవరు కాల్ చేస్తున్నారో చెప్పగలిగే సౌకర్యం అందిస్తుంది. అయితే, కొన్నిసార్లు కాలర్ పేరు తప్పుగా లేదా ఇబ్బంది కలిగించేలా చూపిస్తుంటుంది. మీకూ ఇలాంటి సమస్య ఎదురైతే, సరైన చోటుకే వచ్చారు. ఇప్పుడు, ఆండ్రాయిడ్, ట్రూ కాలర్‌లో మీ పేరును ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం.

ప్రాసెస్ 

Truecallerలో మీ పేరును అప్‌డేట్ చేయడానికి స్టెప్ బై స్టెప్  గైడ్ 

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ట్రూ కాలర్ యాప్ ఇన్‌స్టాల్ చేసినట్లయితే,ఈ క్రింది విధంగా మీ పేరును మార్చుకోవచ్చు. ముందుగా ట్రూ కాలర్ యాప్‌ను ఓపెన్ చేసి,ఎడమ వైపు పై భాగంలో కనిపించే 'హ్యాంబర్గర్ మెనూ' (మూడు అడ్డ గీతలు)పై క్లిక్ చేయండి. తర్వాత, మీ పేరు పక్కన ఉన్న'ఎడిట్'బటన్ (పెన్సిల్ ఐకాన్) పై నొక్కండి. ఆ తరువాతి పేజీలో, ట్రూ కాలర్‌లో ఇతరులు మీ పేరును ఎలా చూడాలని మీరు కోరుకుంటున్నారో, ఆ పేరు టైప్ చేసి'సేవ్' బటన్‌ను క్లిక్ చేయండి. ఈ ప్రక్రియతో మీ పేరు సాధారణంగా వెంటనే మారుతుంది.అయితే, కొన్ని సందర్భాల్లో మార్పు ప్రభావం చూపడానికి 24 నుంచి 48 గంటల వరకు సమయం పట్టవచ్చని ట్రూ కాలర్ వెల్లడిస్తుంది.