LOADING...
Hanumantha Rao Chowdary: టీడీపీకి తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత
టీడీపీకి తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత

Hanumantha Rao Chowdary: టీడీపీకి తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా గుండె, మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, గత నెల రోజులుగా అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చివరకు మృతి చెందినట్లు సమాచారం.

Details 

టీడీపీ అధ్యక్షుడిగా పది సంవత్సరాల పాటు బాధ్యతలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా ఆరు సంవత్సరాల పాటు సేవలందించిన హనుమంతరాయ చౌదరి, ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా దాదాపు పది సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. రాజకీయ జీవితాన్ని గ్రామస్థాయి నుంచి ప్రారంభించిన ఆయన, కళ్యాణదుర్గం మండలం గరుడాపురం పంచాయతీలో వార్డు మెంబర్‌గా మొదలుపెట్టి, అనంతరం ఎమ్మెల్యేగా ఎదిగి ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 'ఆయన స్వగ్రామమైన కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Advertisement