LOADING...
Vizianagaram: విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్దం.. అందులో 37 మంది ప్రయాణికులు
విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్దం.. అందులో 37 మంది ప్రయాణికులు

Vizianagaram: విజయనగరం జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్దం.. అందులో 37 మంది ప్రయాణికులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా రామభద్రపురం-సాలూరు రహదారిపై తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. భువనేశ్వర్ నుంచి జైపూర్‌కు వెళ్తున్న ఆరంజ్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు టైర్ పేలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ దశరథ్ అప్రమత్తంగా స్పందించి వెంటనే బస్సును ఆపడంతో, అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగగలిగారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

వివరాలు

తప్పిన ప్రాణాప్రాయం

ఈ బస్సులో ఒడిశాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement