LOADING...
Google Pixel 8a Price: 'గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ'పై భారీగా తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ అదనం!
'గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ'పై భారీగా తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ అదనం!

Google Pixel 8a Price: 'గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ'పై భారీగా తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ అదనం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లతో 'ఫ్రీడమ్‌ సేల్‌'ను ప్రారంభించింది. ఆగస్టు 13 నుంచి 17 వరకు కొనసాగే ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గృహోపకరణాలు వంటి పలు విభాగాల ఉత్పత్తులపై బంపర్‌ డిస్కౌంట్‌లు అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్‌, మోటరోలా, ఎంఐ, నథింగ్‌, వివో, గూగుల్‌ పిక్సెల్‌, ఒప్పో వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై ఆకట్టుకునే తగ్గింపులను ప్రకటించింది. ఈ క్రమంలో గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక ఆఫర్‌ లభిస్తోంది. గతేడాది భారత మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్‌ 8జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.52,999.

Details

రూ.37,999లకే లభ్యం

అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ.37,999కి లభిస్తోంది. అంటే 28శాతం తగ్గింపు లభించి, వినియోగదారులు రూ.15 వేలు ఆదా చేసుకోవచ్చు. దీనికి అదనంగా బ్యాంక్‌ ఆఫర్లు కూడా వర్తిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చెల్లిస్తే మరో 5శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ధర మరింత తగ్గుతుంది. గూగుల్‌ పిక్సెల్‌ 8ఏకు 7 సంవత్సరాల పాటు ఓఎస్‌ అప్‌డేట్‌లు అందించనున్నట్లు సంస్థ తెలిపింది.

Details

గూగుల్‌ పిక్సెల్‌ 8ఏ ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.1 ఇంచెస్‌ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ రక్షణ, ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఇందులో ప్రత్యేకత. వెనుక భాగంలో 64MP ప్రాధాన్య కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ ఉంటాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరా ఇచ్చారు. 4404mAh బ్యాటరీతో పాటు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ కలదు. కనెక్టివిటీ పరంగా వైఫై 6, బ్లూటూత్‌ 5.3, NFC సపోర్ట్‌ లభిస్తుంది. అదనంగా *ఆడియో మ్యాజిక్‌ ఎరేజర్* ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది.