Digital Hawala: అంతర్జాతీయ స్కామ్ సిండికేట్‌లకు సంబంధం ఉన్న నకిలీ ఖాతాలను గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ కేంద్రంగా నేరగాళ్లకు ఆధారంగా నిలిచిన 'డిజిటల్ హవాలా' వ్యవస్థను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సుదీర్ఘ విచారణ తర్వాత ఛేదించింది. ఈ వ్యవస్థకు అంతర్జాతీయ స్కామ్ సిండికేట్‌లతో సంబంధం ఉన్న దాదాపు 8,000కి పైగా నకిలీ బ్యాంక్ ఖాతాలను NIA బ్లాక్ చేసింది. సైబర్ మోసాల ద్వారా దొచ్చిన డబ్బును వేర్పాటువాదం, ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. మూడు సంవత్సరాల పాటు వివిధ దర్యాప్తు సంస్థలతో కలిసి తీసుకున్న విచారణ ఫలితంగా ఈ డిజిటల్ హవాలా వ్యవస్థ బట్టబయలైంది. జమ్ముకశ్మీర్ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు అక్రమ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వలన నేరగాళ్లు నగదు రవాణాకు కొత్త మార్గాలను అన్వేషించారనే విషయం వెల్లడైంది.
Details
పౌరుల గుర్తింపు కార్డులను ఉపయోగించి నకిలీ ఖాతాలు
అందుకే, సంప్రదాయ హవాలా మార్గాల బదులు 'డిజిటల్ హవాలా'ను ఉపయోగించడం మొదలుపెట్టారు. కొన్ని సందర్భాల్లో, సాధారణ పౌరుల గుర్తింపు కార్డులను ఉపయోగించి షెల్ కంపెనీల పేర్లతో నకిలీ ఖాతాలను తెరిచినట్లు అధికారులు గుర్తించారు. వీటి ద్వారా రోజుకు లక్షల రూపాయలను చిన్న మొత్తాలుగా విభజించి ఇతర ఖాతాలకు మారుస్తూ, బ్యాంక్ అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తులో గుర్తించబడిన వివరాల ప్రకారం, నిందితులు అమాయకుల నుండి దోచుకున్న డబ్బును తరచూ క్రిప్టోకరెన్సీ రూపంలోకి మార్చుతున్నారు. ఈ హవాలా ఖాతాలను కట్టడికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేయాలని NIA జమ్మూ కశ్మీర్ పోలీసులు మరియు సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సూచించింది.