Artificial Intelligence : 'ఏఐకి బానిసైతే మెదడు బలహీనమే'.. పరిశోధనలో షాకింగ్ నిజాలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై మనం పెంచుకుంటున్న ఆధారపడటం, క్రమంగా మన మెదడు సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఈ మార్పు ఒక్కసారిగా కనిపించదని, కానీ మనకు తెలియకుండానే నెమ్మదిగా మన ఆలోచనా విధానాన్ని ఏఐ మార్చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా, బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన "AI సహాయం పట్టుదలను తగ్గించడమే కాక స్వతంత్ర పనితీరుకు హాని కలిగిస్తుందనే అధ్యయనంలో ఈ ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి.
వివరాలు
ద
ఈ పరిశోధనలో భాగంగా గణితం చేయడం, చదవడం, విశ్లేషణ వంటి మెదడుకు శ్రమ అవసరమైన పనుల్లో ఏఐ పాత్రను పరిశీలించారు. ఏఐ సహాయంతో పనులు వేగంగా, ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతున్నా, అసలు సమస్య ఏఐ అందుబాటులో లేనప్పుడు ప్రారంభమవుతుందని తేలింది. సుమారు 1,000 మంది పాల్గొన్న ఈ ప్రయోగంలో ఒక గ్రూప్‌కు ఏఐ సాయం అందించగా, మరో గ్రూప్ స్వయంగా సమస్యలను పరిష్కరించింది. ఏఐ వాడిన వారు వేగంగా సమాధానాలు ఇచ్చినా, ఆ టూల్‌ను అకస్మాత్తుగా తీసేసిన తర్వాత వారి పనితీరు గణనీయంగా పడిపోయింది.
వివరాలు
పరిశోధనలో వెలుగులోకి వచ్చిన కీలక అంశాలు
తప్పులు పెరుగుదల : ఏఐ లేకుండా ఇచ్చిన సమాధానాల్లో తప్పులు అధికంగా కనిపించాయి. ఓపిక తగ్గుదల : కష్టమైన సమస్యలను పూర్తి చేసే వరకు ప్రయత్నించకుండా మధ్యలోనే వదిలేశారు. త్వరగా అలసిపోవడం : కేవలం 10 నిమిషాల పాటు ఏఐ ఉపయోగించినా, దాని లేకపోతే పనితీరు బలహీనమైంది. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తలు "కాగ్నిటివ్ ఆఫ్‌లోడింగ్"గా అభివర్ణిస్తున్నారు. అంటే మన మెదడు చేయాల్సిన పనులను యంత్రాలకు అప్పగించడం. ఈ అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుడు రాచిత్ దూబే ప్రకారం, "ఏఐ లేకుండా ప్రజలు తప్పులు చేయడమే కాదు, స్వతంత్రంగా ఆలోచించాలనే ఆసక్తి కూడా కోల్పోతున్నారు."
వివరాలు
భవిష్యత్తులో మానవ సామర్థ్యాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
సృజనాత్మకత తగ్గిపోవచ్చు ఆత్మవిశ్వాసం దెబ్బతినవచ్చు క్లిష్ట సమస్యలను ఎదుర్కొనే స్థైర్యం తగ్గిపోవచ్చు అదనంగా, చాట్‌బాట్‌లపై అధికంగా ఆధారపడటం వల్ల అసహనం పెరగడం, లోతుగా ఆలోచించడాన్ని భారంగా భావించే స్వభావం పెరగడం వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయని అధ్యయనం హెచ్చరిస్తోంది. కాబట్టి, ఏఐ మనకు ఏం చేస్తోంది అన్నదానికంటే, అది మనలోని ఏ సామర్థ్యాలను నెమ్మదిగా దూరం చేస్తోందో గుర్తించే సమయం వచ్చిందని నిపుణులు సూచిస్తున్నారు.