ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు
గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో భాగంగా ఇండియాకి వచ్చిన సుందర్ పిచాయ్, టెక్నాలజీ పరంగా ఎన్నో అవకాశాలున్న దేశంగా ఇండియా ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుతం గూగుల్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తోంది. 100 భారతీయ భాషల్లో స్పీచ్, టెక్స్ట్ తో సెర్చ్ చేసే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ను డెవలప్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రపంచంలోని 1000భాషల్లో ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారని సుందర్ పిచాయ్ చెప్పుకొచ్చారు. మారుమూల పల్లెటూరు ప్రజలు కూడా గూగుల్ ని వాడేలా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ను తయారు చేస్తున్నామని అన్నారు. ఇండియా గురించి మాట్లాడిన సుందర్ పిచాయ్, టెక్నాలజీ రంగంలో భారతదేశం దూసుకుపోతుందని, ముఖ్యంగా డిజిటల్ విభాగంలో మెరుగైన వృద్ధి సాధించినట్లు తెలిపాడు.
డిజిటల్ లో దూకుడు
2020లో ఇండియాలో 10బిలియన్ డాలర్లు డిజిటల్ సర్వీసెస్ లో ఇన్వెస్ట్ చేస్తామని గూగుల్ ప్రకటించింది. ప్రస్తుతం ఆ ఇన్వెస్ట్ మెంట్స్ ని పరిశీలించానని సుందర్ పిచాయ్ చెప్పారు. ఈ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ లో ఇండియాకు చెందిన ఐటీ శాఖమంత్రి పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో టెక్నాలజీలోఇండియా దూసుకుపోనుందని, దానికి సాక్ష్యంగా యూపీఐ సర్వీసులు నిలిచాయని అన్నారు. ఇదే సమావేశంలో తమ తర్వాతి పథకాల గురించి వివరిస్తూ, ప్రపంచంలోని వెయ్యి భాషల్లో సమాచారాన్ని జనాలకు ఇచ్చేలా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ని రూపొందిస్తున్నామని తెలిపారు. మొత్తానికి గూగుల్ ముందు పెద్ద ప్లానే ఉంది. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి సరికొత్త విప్లవాన్ని సృష్టించనున్నట్లు తెలుస్తోంది.